NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

AP Elections 2024: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వానికి నేతలు తెరలేపారు. శనివారం రాత్రి నుండి ఓటర్లకు నగదు పంపిణీని ఆయా పార్టీల నేతలు ప్రారంభించారు. చాలా నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

Vanga Geetha

కీలక నియోజకవర్గాల్లో ఎక్కువగానే ఓటర్లకు ముట్టజెబుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఓటుకు వెయ్యి నుండి రూ.5వేల వరకూ పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తొంది. అయితే డబ్బుల పంపిణీ విషయంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. కొంత మందికి ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో పిఠాపురం లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని కొందరు ఓటర్లు చుట్టుముట్టారు. వార్డుల్లో కొంత మందికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చే వరకూ కదిలేది లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు.

అలానే ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండవరంలో వైసీపీ ఇచ్చే డబ్బులు అందలేదని స్థానికులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రమాణం చేస్తేనే డబ్బులిస్తామని వైసీపీ నేతలు చెప్పడంతో ఎదురు తిరిగి ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణం చేయబోమని చెప్పారు. అభ్యర్ధుల నుండి తమ పేరిట డబ్బు తీసుకుని పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.

పలు ప్రదేశాల్లో చీరలు పంపిణీ చేస్తే మహిళలు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తొంది. డబ్బులే కావాలని డిమాండ్ చేస్తున్నారుట. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువగానే పంపిణీ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N