NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

MLC Election: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు  ప్రారంభమైంది. మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాల లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా, మార్చి 28న పోలింగ్ జరిగింది. 1,437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కౌంటింగ్ ను జూన్ 2 (నేటికి) వాయిదా వేశారు.

కౌంటింగ్ కోసం మొత్తం అయిదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లపై 300  ఓట్లు, మరో టేబుల్ పై 237 ఓట్లు చొప్పున లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు.

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.

5న నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్

నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఈ నెల 5న నల్లగొండ సమీపంలోని దుప్పలపల్లి లో నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. నాలుగు కౌంటింగ్ హాల్స్ లో 24 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం 900 మంది సిబ్బందిని నియమించారు. ఈ స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N