పాక్ లో సత్సంబంధాలకు ఓకే..కానీ

పాకిస్థాన్ తో అమెరికా సత్సంబంధాలనే కోరుకుంటోందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. త్వరలో పాకిస్థాన్ కొత్త నాయకత్వంతో సమావేశం అవుతానని పేర్కొన్నారు. పాకిస్థాన్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం కానీ  ఆ దేశం శత్రువులకు ఆశ్రయం ఇస్తోందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ సహచరులతో భేటీలో పాకిస్థాన్ తో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలోనే పాకిస్థాన్ కు 1.3 బిలియన్ డాలర్ల అమెరికా సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ శత్రువులకు (ఉగ్రవాదులకు) ఆశ్రయం ఇస్తుండటమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. తాలిబన్లతో శాంతి చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో త్వరలో భేటీ అవుతున్నట్లు పేర్కొన్నారు.

SHARE