NewsOrbit
న్యూస్

ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకుంటున్నారా ..? అయితే ఈ స్కీం మీ కోసమే..!

 

పర్యావరణ పరిరక్షణ దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది.. ఇంతకీ ఈ FAME-II స్కీమ్‌ ఏంటి..? దీని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వారికి వచ్చే లాభాలు ఏంటి..? సబ్సిడీ ప్రభుత్వం ఎలా ఇవ్వనుందో తెలుసుకుందాం..!

 

 

ఫేమ్ 2 స్కీం వివరాలు :

ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ & ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇన్ ఇండియా(FAME). ఈ స్కీం కింద రెండో విడత కేంద్రం రూ.10,000 కోట్ల ప్యాకేజీ కేటాయించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు భారీ సబ్సిడీ లభించనుంది. ఈ పథకం 2022 మార్చి 31 వరకు వర్తిస్తుంది. ఇందులో 80 శాతం ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఖర్చు చేస్తున్నారు. 8596 కోట్ల రూపాయలను ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కొనే వారికి సబ్సిడీ ఇవ్వడానికి. 1000 కోట్ల రూపాయలు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి. ప్రతి నేషనల్ హైవే పై ప్రతి 25 కిలోమీటర్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 38 కోట్ల రూపాయలను ఈ పాలసీని అడ్మినిస్ట్రేటివ్ చేయడానికి, పబ్లిసిటీ కోసం ఉపయోగించనున్నారు.

టూ వీలర్స్ :
ఈ స్కీం కింద 2 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే మొట్ట మొదటి పది లక్షల టూవీలర్స్ కొనేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా దీనికి బ్యాటరీఆధారం గా సబ్సిడీ ఇవ్వనుంది. ఒక కిలోవాట్ అవర్ బ్యాటరీ కి 10000, రెండు కిలోమీటర్ల బ్యాటరీకైతే 20000 రూపాయలు. అలాగా రెండు వేల కోట్ల రూపాయల వరకు అందించనున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర మాత్రం 1.5 లక్షల రూపాయలు వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. ఇంకా లిథియం బ్యాటరీ అయి ఉండాలి. మాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకు40 కిలోమీటర్లు ఉండాలి. ఒక్క ఛార్జింగ్ కు మినిమం 80 కిలోమీటర్స్ రేంజ్ రావాలి. యాక్సిలరేషన్ సెకండ్ కి 0.65 మీటర్ల, పవర్ కంజెప్షన్ 100కిలోమీటర్లకు 7 యూనిట్లు మించి ఉండకూడదు. ఈ కండిషన్స్ అన్నీ ఉంటేనే ఫేమ్ 2 కింద సబ్సిడీ లభిస్తుంది. అదే ఫేమ్ 1 స్కీం కింద అయితే ఇన్ని కండీషన్స్ లేవు.

 

త్రీవీలర్స్ :

మొదటి 5లక్షల ఎలక్ట్రికల్ త్రీవీలర్స్ కొనేవారికి ఇస్తుంది. ఎలక్ట్రిక్ ఆటో, రిక్షాలకు 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కి 50,000 వరకు ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర 5 లక్షలు మించకూడదు. 2500 కోట్ల రూపాయలు కేటాయించింది. దీని పవర్ కంజెప్షన్ 8 యూనిట్లకు మించకూడదు. ఒక్క ఛార్జింగ్ కి మినిమం 80 కిలోమీటర్లు ఉండాలి. అలా అయితేనే త్రీవీలర్స్ కు ఫేమ్ స్కీం కింద సబ్సిడీ వస్తుంది.

ఫోర్ వీలర్స్ :
మొదటి 35000 ఫోర్ వీలర్ వారికీ, మొట్టమొదటి 20వేల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు కి ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర 15 లక్షలు మించకూడదు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 70 కిలోమీటర్లు, యాక్సిలరేషన్ 1.04 మీటర్స్ అయ్యుండాలి. మినిమం 140 కిలోమీటర్లు, పవర్ 15 కిలోవాట్ అవర్ లకు మించి ఉండకూడదు. పవర్ కంజెప్షన్ ఇరవై కిలోమీటర్లకు మించకూడదు. అర్హులు అవ్వాలంటే కచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే కమర్షియల్ వెహికల్స్ ఓలా, ఉబెర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే వారికి సబ్సిడీ లభిస్తుందని ఈ పాలసీ లో ఉంది. ప్రైవేట్ గా కొనుక్కునే వారికైతే ఈ సబ్సిడీ రాదు.

 

ఎలక్ట్రిక్ బస్సులు :
మొదటి 7090 ఎలక్ట్రిక్ బస్సులకు ఫేమ్ టూ స్కీమ్ లోని డబ్బులను ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్క బస్సు కు 50 లక్షల సబ్సిడీ ఇస్తారు. ఇందుకు 3540 కోట్ల రూపాయలు కేటాయించారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మూడు వేల కోట్ల రూపాయలను ఎలక్ట్రిక్ బస్సులు కొన్నవారికి కేటాయించింది. అంటే ప్రజలకు ఎక్కువ అవగాహన రావాలని దీని ముఖ్య ఉద్దేశం. 7090 వెహికల్స్ ను ఆర్టీసీ బస్సులు కు ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా సబ్సిడీ ఇస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తీసుకుంది. కేరళ ప్రభుత్వం కూడా అదే ప్రక్రియలో ఉంది.ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ద్వారా తీసుకుంటారో వారికి 50 లక్షల రూపాయల సబ్సిడీ అందుతుంది. ఈ షరతులు అన్నిటిని ఈ నిబంధనలు అన్నిటికీ పాటిస్తేనే సబ్సిడీ లభిస్తుంది. సీవిఎంఆర్ 1989 రూల్స్ కూడా పాటించాలి.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?