NewsOrbit
న్యూస్

partner’s phone secret: మీ పార్టనర్ ఫోన్  సీక్రెట్ గా చెక్  చేయాలనిపిస్తుందా?  అయితే ఇలా చేయండి!!

partner’s phone secret: కొన్ని కొన్ని కారణాలతో మీకు  మీ భాగస్వామి  ఫోన్  చెక్ చేయాలన్న ఆలోచన  రావచ్చు. వారు  ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నారా? లేదా డేటింగ్ యాప్స్  వాడుతున్నారా ? అని  తెలుసుకోవాలని ఆసక్తి ఉండొచ్చు. కొంతమంది  తమ భాగస్వామి  కి  ఫోన్ విషయంలో  ఎలాంటి ఆంక్షలు విధించరు. ఇంకొందరు  మాత్రం తమ ఫోన్‌ని  భాగస్వామి చూడటం అనేది నచ్చదు.  అలాంటప్పుడు మీ భాగస్వామి ఫోన్  చూడాలనుకోవడం  సరైన పనేనా?  ఈ విషయాలు గురించి తెలుసుకుందాం.మీ భాగస్వామి ఫోన్ చెక్ చేసే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే..  వారి అనుమతి లేకుండా వారి ఫోన్ చూడటం అనేది  వారి ప్రైవసీకి భంగం కలిగించడమే అని చెప్పక తప్పదు. మీ భర్త కూడా మీకు తెలియకుండా మీ ఫోన్ చూస్తూ..  ఛాట్ చేసుకున్న విషయాలన్నీ చదివితే ఎలా ఉంటుందో  ఒకసారి ఆలోచించండి….    అదే విషయం మీకు వర్తిస్తుంది. మీ భాగస్వామి ఫోన్ చెక్ చేయాలని  మీరు అనుకుంటున్నారు అంటే  మీ ఇద్దరి బంధం లో  ఎక్కడో  పొరపాటు జరుగుతున్నట్లు అర్థం ..

మీ బంధాన్ని మీరు  సురక్షితంగా భావించక పోయిన, లేదా మీ భాగస్వామి మీ దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానించినా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు.. మీ భాగస్వామి ఫోన్   చూడాలనిపించడం  సహజమే. కానీ ఇది అప్పటికి సరైన విషయం గా అనిపించినా కానీ దీనివల్ల కొంత కాలం తర్వాత సమస్యలు  వచ్చే  అవకాశం ఉంది. వారి  చాటింగ్ లో  కొన్ని మాటలు చదివి మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా  ఉంది .అక్కడ వారి ఇంటెన్షన్ వేరుగా ఉండవచ్చు.. మీరు చదివేటప్పుడు అది మీకు వేరుగా అనిపించ వచ్చు.. అందులో ఎదో చిన్న అనుమానం తో ఫోన్ చెక్ చేస్తున్నారు కాబట్టి  ఎదో తేడాలున్నట్టు అనుమానం కలగవచ్చు. కొందరి మధ్య ఉన్న బందం వలన  ఇలా ఒకరి వస్తువులు మరొకరు  వాడుకునే  స్వేచ్ఛ  ఉంటుంది. చాలామంది తమ భాగస్వామితో కలిసి పాస్ వర్డ్స్   పంచుకుంటూ ఉంటారు.వారికీ మధ్య ని ఫోన్ నా ఫోన్ అనే తేడా ఏమి ఉండదు.   అన్ని విషయాలను పంచుకుంటారు. అలాంటప్పుడు  తమ భాగస్వామి పక్కన లేనప్పుడు కూడా ఫోన్ చూసేంత స్వేచ్ఛ వారికీ ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైన బంధం గా చెప్పుకోవచ్చు ఇలా జరగాలంటే   ఒకరినొకరు నమ్మాలి.  ఒకవేళ మీరిద్దరూ ఫోన్ పాస్ వర్డ్‌లు ఒకరితో మరొకరు  షేర్ చేసుకోక పొతే మాత్రం  ఫోన్ చెక్ చేయడానికి  కాస్త ఆలోచించండి.  .మీ భాగస్వామి తన ఫోన్ ప్రైవసీ విషయంగా    పెట్టుకుంటే తన ఫోన్ చెక్ చేయాలని అనిపిస్తే ,మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి.

నాకు ఇలా చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఇది మా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందా? మా బంధంలో అనుమానం కంటే నమ్మకాన్ని పెంచుకునేందుకు నేనేం చేయగలుగుతాను? ఇలా చెక్ చేసే ముందు నేను తన అనుమతి తీసుకుంటే ఏమవుతుంది? వంటి ప్రశ్నలు మీకు మీరు వేసుకోవడం  అవసరం.  ఇప్పుడు మీ బంధానికి సంబంధించిన  మరింత క్లారిటీ పొందే అవకాశం ఉంది. మీ బంధంలో మీరు అనుమానంతో ఉంటే.. తన ఫోన్ చెక్ చేయాలనే ఆలోచన మీకు వస్తుంది.  కాబట్టి అలాంటి ఆలోచన రానివ్వకండి . కొన్ని పరిస్థితుల్లో మీ భాగస్వామి మీతో సరిగా  ఉండకపోతే  విషయం ఏమిటో అడిగి తెలుసుకుని  దాన్ని  అర్ధం చేసుకుని పరిష్కరించుకోండి.

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju