NewsOrbit
న్యూస్

క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందాల‌ని చూస్తున్నారా..? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్న క‌రోనా క‌వ‌చ్ పాల‌సీల‌ను తీసుకుంటున్నారు. క‌రోనా వ‌స్తే ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందడం కోసం వారు ఈ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను తీసుకుంటున్నారు. అయితే ఈ పాల‌సీల వ‌ల్ల పూర్తిగా క్యాష్ లెస్ ప‌ద్ధ‌తిలో హాస్పిట‌ళ్ల‌లో ట్రీట్‌మెంట్ పొంద‌వ‌చ్చు. ఇది ఎంతో సుల‌భ‌త‌రం కూడా. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లో ఈ ఇన్సూరెన్స్ ఎంత‌గానో ప‌నికొస్తుంది. అన‌వ‌స‌రంగా జేబు నుంచి డ‌బ్బుల‌ను ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌ని ఉండ‌దు. మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వారే చూసుకుంటారు. హాస్పిట‌ల్‌లో చేరిన ద‌గ్గ‌ర్నుంచీ డిశ్చార్జి అయ్యాక కోలుకునే వర‌కు ఇన్సూరెన్స్ కంపెనీ వారే క్యాష్‌లెస్ ప‌ద్ధ‌తిలో సౌక‌ర్యం అందిస్తారు. అయితే ఈ పాల‌సీల‌ను తీసుకునేవారు, ఉప‌యోగించాల‌నుకునేవారు కింద తెలిపిన ముఖ్య‌మైన విష‌యాల‌ను గుర్తుంచుకోవాలి. అవేమిటంటే…

want to take cashless treatment know these

* చాలా వ‌ర‌కు ఇన్సూరెన్స్ కంపెనీలు దేశంలోని అనేక ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌తో టై అప్ అయ్యాయి. అందువ‌ల్ల వాటిని నెట్‌వ‌ర్క్ హాస్పిట‌ల్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అయితే మీరు తీసుకున్న ఇన్సూరెన్స్‌కు ఏ నెట్‌వ‌ర్క్ హాస్పిట‌ల్ అందుబాటులో ఉందో చూసుకుని వెళితే చాలా సుల‌భంగా క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ తీసుకోవ‌చ్చు. లేదంటే ఆ ప్ర‌క్రియ కొంత వ‌ర‌కు ఆల‌స్యం అవుతుంది.

* ఒక వేళ హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స పొంది త‌రువాత డిశ్చార్జి అయ్యాక ఆ ఖ‌ర్చు మొత్తాన్ని రీయెంబ‌ర్స్‌మెంట్ చేసుకుందామ‌నుకుంటే.. మొత్తం బిల్లులు, ఇత‌ర ప‌త్రాల‌న్నింటినీ సేక‌రించి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. ఆ త‌రువాతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. దీంతో సుల‌భంగా పాల‌సీ క్లెయిమ్ ప్రాసెస్ జ‌రుగుతుంది. లేదంటే ఆల‌స్యం అవుతుంది.

* హాస్పిట‌ల్‌లో చేరిన 24 గంట‌ల లోపు లేదా హాస్పిట‌ల్‌లో చేరుదామ‌నుకునే స‌మ‌యానికి 48 గంట‌ల ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలిపితే.. క్యాష్ లెస్ చికిత్స సుల‌భంగా జ‌రుగుతుంది.

* క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు హాస్పిట‌ళ్ల‌లో ఇన్సూరెన్స్ కంపెనీల‌కు చెందిన హెల్ప్ డెస్క్‌లు ఉంటాయి. వారికి ఆ చికిత్స‌కు గాను ఫాం నింపి ఇవ్వాలి. అలాగే వారు ఏదైనా అడిగితే వెంట‌నే స‌మాధానం ఇవ్వాలి. ఆల‌స్యం చేస్తే క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొంద‌లేరు. అయితే త‌రువాతైనా ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ కోసం అప్లై చేయ‌వ‌చ్చు. హాస్పిట‌ల్‌లో అయిన ఖ‌ర్చు మొత్తాన్ని త‌రువాత కూడా క్లెయిమ్‌కు అప్లై చేసి రీయెంబ‌ర్స్‌మెంట్ పొంద‌వ‌చ్చు. ఇక హాస్పిట‌ల్‌లో ఫాం నింపి ఇవ్వ‌గానే వారు త‌నిఖీ చేసి అప్రూవ‌ల్ లెట‌ర్ ఇస్తారు. త‌రువాతే క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ మొద‌ల‌వుతుంది.

author avatar
Srikanth A

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N