NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ వార్ :జగన్ కు చెక్మేట్ చెప్పిన జర్నలిస్టు మూర్తి!

వైకాపా హిట్లిస్టులో ఉన్న మీడియా సంస్థల్లో ఒకటైన టీవీ5 చైర్మన్ నాయుడు,జర్నలిస్టు మూర్తి హైకోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ పొందారు.గురువారం రాత్రి టీవీ5 మూర్తి స్వయంగా తానే స్క్రీన్ మీదకొచ్చి ఈ విషయం ప్రకటించారు. అంతకు కొన్ని రోజుల ముందు టీవీ5మూర్తి స్క్రీన్‌ మీదకు రాలేదు.

కారణమేంటా అని చాలా అనేక రకాలుగా అనుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ తమపై పెట్టిన కేసులో బెయిల్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నందువల్లే ఇన్ని రోజుల పాటు స్క్రీన్ పైకి రాలేదని మూర్తి వివరణ ఇచ్చారు .దీంతో అసలు జగన్ ప్రభుత్వ టీవీ5 పై పెట్టిన కేసు ఏమిటన్న విషయంలో ఆసక్తి నెలకొంది .దీనిని కూడా మూర్తి అసలు జరిగిందేమిటో స్పష్టంగా వివరించారు. నిజానికి ఆ కేసు చిన్నా చితక కూడా కాదు .ఏకంగా ప్రభుత్వానికి చెందిన నోట్ ఫైల్ దొంగిలించారన్న అభియోగంపై వీరి మీద కేసు నమోదయింది.యూనివర్సిటీ పాలక మండళ్ల నియామకంలో రాజకీయ జోక్యంపై గతంలో టీవీ5 లో మూర్తి ఒక డిబేట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి ,పదవీ విరమణ అనంతరం న్యాయవాదిగా పనిచేస్తున్న శ్రవణ్ ఈ డిబేట్లో పాల్గొనడమే కాకుండా యూనివర్సిటీ పాలక మండల సభ్యుల నియామకంలో రాజకీయ నాయకుల సిఫార్సులను వివరిస్తూ ,ఈ యూనివర్సిటీ పాలక మండళ్లలో సభ్యులుగా నియమించాలని వారు సిఫార్సు చేసిన ఒక నోట్ ఫైల్ ని కూడా స్క్రీన్పై ప్రదర్శించారు.యూనివర్సిటీలు కూడా చివరకు రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని శ్రవణు ఈ సందర్భంగా ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజల రామకృష్ణారెడ్డి తర్వాత స్పందిస్తూ ఏం గతంలో టిడిపి అలా చేసుకోలేదా అని కూడా ప్రశ్నించారు .కరోనా లాక్ డౌను కు ముందు జరిగిన ఈ చర్చ ఆ తదుపరి పాతబడిపోయింది.అయితే టీవీ అయితే ప్రభుత్వం మాత్రం ఆ నోట్ ఫైల్ బయట కెలా వచ్చిందన్న అంశంపై దృష్టి కేంద్రీకరించింది.యూనివర్సిటీ వ్యవహారాలు చూస్తే ప్రభుత్వ విభాగం అధికారి ఆ నోట్ ఫైల్ దొంగిలింపబడినదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న టీవీ చానల్ కావటంతో సిఐడి అధికారులు కూడా ఉత్సాహంగా టీవీ5చైర్మన్ నాయుడు జర్నలిస్టు మూర్తితో పాటు న్యాయవాది శ్రవణ్ పై కూడా కేసు నమోదు చేశారు .దీంతో నాయుడు, మూర్తిల పక్షాన ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకరు హైకోర్టులో పోరాడి చివరకు గురువారం వారికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చిపెట్టారు.ఏదేమైనా మీడియా నెత్తిన ప్రభుత్వ కత్తి వేళ్లాడుతున్న సంకేతాలు ఇలాంటి ఉదంతాల ద్వారా వెలువడుతున్నాయి

author avatar
Yandamuri

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!