Bheemla nayak – Radhe shyam: పవర్ స్టార్ – పాన్ ఇండియన్ స్టార్స్ మధ్య వార్ గట్టిగానే ఉంది..ఎవరూ తగ్గట్లేదు..!

Share

Bheemla nayak – Radhe shyam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు పోటీకి దిగినా మొదటి ఛాయిస్ మాత్రం పవన్‌కే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహాలు ఉండవనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేయపోయినా ప్రభాస్ బాహుబలి, సాహో లాంటి సినిమాలతో వచ్చిన పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్‌తో సమానమైన క్రేజ్ ఉండటం విశేషం. అదే ఇప్పుడు సంక్రాంతి రేస్‌లో బిగ్ ఫైట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇద్దరూ ఇద్దరే అనేట్టుగా వారం ముందు వస్తున్న ఆర్ఆర్ఆర్ వంటి భారీ కాన్వాయిస్ ఉన్న సినిమాను కూడా లెక్క చేయకుండా తమ సినిమాలతో రెడీ అవుతున్నారు.

war between Power star pan indian stars
war between Power star pan indian stars

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కాంప్రమైజ్ పోస్ట్‌పోన్ చేసుకోమన్నా కూడా అటు ప్రభాస్ గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గానీ వెనక్కి తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయం పక్కన పెడితే కేవలం 48 గంటల తేడాతో పవర్ స్టార్ – పాన్ ఇండియన్ స్టార్ సినిమాలు భీమ్లా నాయక్ – రాధే శ్యామ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం రీమేక్. ఇందులో రానా నటిస్తున్నాడు. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతోంది. ఇప్పటికే థమన్ మొగించిన మోతతో భారీ అంచనాలను పెంచేసింది.

Bheemla nayak – Radhe shyam: పవన్ భీమ్లా నాయక్‌ను తట్టుకొని నిలబడాలంటే స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి.

ఇక రాధే శ్యామ్ పక్కా క్లాస్ మూవీ. ప్రభాస్ నుంచి లవ్ స్టోరి వచ్చి 10 ఏళ్ళు పైనే అయింది. పైగా ఇది పీరియాడికల్ లవ్ స్టోరి..ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఇప్పటి వరకు చేయనిది. దాంతో ఈ సినిమా మీద కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం పవన్ – రానాల భీమ్లా నాయక్ మీదే విపరీతమైన అంచనాలున్నాయి. అందుకే ఆర్ఆర్ఆర్ మేకర్స్ కూడా పవన్‌ను తన సినిమాను పోస్ట్‌పోన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పోటీలో రాధే శ్యామ్ లాంటి క్లాస్ మూవీ పవన్ భీమ్లా నాయక్‌ను తట్టుకొని నిలబడాలంటే స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. చూడాలి ఈ బాక్సాఫీస్ వార్‌లో ఎవరిది పైచేయి అవుతుందో.


Share

Related posts

మోసం చెయ్యడం మంచిది కాదు

Siva Prasad

సిఐజె పదవికి జస్టిస్ బాబ్డే పేరు సిఫార్సు?

somaraju sharma

 ‘జనసేన’తో స్నేహంకోసం…

Siva Prasad