Start Music :స్టార్ట్ మ్యూజిక్ Start Music తెలుగులో టాప్ యాంకర్స్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, శ్రీముఖి. అవును.. వీళ్లిద్దరి మధ్యనే ఎప్పుడూ టఫ్ ఫైట్ జరుగుతుంది. అఫ్ కోర్స్ సుమ యాంకరింగ్ కు డోకా లేదు. తను యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసే రెండు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ.. తనే ఇంకా తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. ఈమధ్య శ్రీముఖికి కూడా యాంకర్ గా పలు అవకాశాలు వస్తున్నాయి.

అయితే.. మాటీవీలో ఇటీవల స్టార్ట్ మ్యూజిక్ అనే కొత్త షోను ప్రారంభించారు. ఎంటర్ టైన్ మెంట్ ను కొత్త రకంగా ప్రేక్షకులకు అందించడం కోసం రూపొందిందే ఈ షో. ఈ షోకు కూడా యాంకర్ సుమనే.
తాజా ఎపిసోడ్ షూటింగ్ కు వచ్చిన శ్రీముఖి.. ఎవరు ఈ షోకు యాంకరింగ్ చేసేది.. ఇది నా షో.. ఈ యాంకర్ ఎవరో కనకాల అనే పేరు ఉంది. స్టార్ట్ మ్యూజిక్.. శ్రీముఖి అడ్డ.. ఎవరిక్కడ కాలు పెట్టేది అని శ్రీముఖి అనగానే.. వెంటనే ఓ గధ పట్టుకొని అక్కడికి వచ్చిన సుమ.. కనకాల కంచుకోటలోకి వచ్చిన వాళ్లకి ఖబడ్దార్.. అంటూ సుమ వార్నింగ్ ఇవ్వడం.. ఇదంతా చూస్తుంటే.. యాంకరింగ్ విషయంలో ఇద్దరూ కొట్టుకునేలా ఉన్నారు.
Start Music : తాజా ఎపిసోడ్ గెస్ట్ గా యాంకర్ శ్రీముఖి
అయితే.. స్టార్ట్ మ్యూజిక్ తాజా ఎపిసోడ్ గెస్ట్ గా యాంకర్ శ్రీముఖి వచ్చింది. ఈనేపథ్యంలో ఏదో ఫన్ కోసం శ్రీముఖి చేసిన గోల ఇదంతా. తానే ఈ షోకు యాంకర్ అంటూ ఏదో కలరింగ్ ఇవ్వబోయింది కానీ.. తుస్సుమంది. సుమ ముందు ఎవ్వరైనా దిగదుడుపే మరి. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా ఆగాల్సిందే. ప్రస్తుతానికి దాని ప్రోమోను చూసేయండి.