NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వరంగల్లు పోలీసులు బిగ్ షాక్ … పాదయాత్ర పై సందిగ్దత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా సాగిన పాదయాత్ర ప్రస్తుతం మూడో ధశలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఎక్కువయ్యాయి. మంగళవారం నిరసన కార్యక్రమంలో ఉన్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో కేసిఆర్ సర్కార్ పై ఆయన నిప్పులు చెరిగారు.

 

ఎక్కడ అయితే పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుండి కొనసాగిస్తానని బండి సంజయ్ ప్రకటించారు. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి, భద్రత కల్పించాలని కోరుతూ బీజేపీ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. దీంతో మరో సారి బుధవారం పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. మరో పక్క బీజేపీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను కలిసింది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు యాత్రకు తగిన భద్రత కల్పించేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందనరావు, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, వివేక్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు ఉన్నారు.

 

మరో పక్క పాదయాత్ర నిలిపివేయాలంటూ బండి సంజయ్ కి వరంగల్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్రకు సంబంధిత అధికారుల నుండి అనుమతి తీసుకోలేదనీ, సభల్లో నేతలు కించపరిచే ప్రసంగాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ ను, ముఖ్యమంత్రి కేసిఆర్ ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి విమర్శలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులు పాదయాత్రను నిలుపుదల చేయాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం నుండి జరిగే పాదయాత్రపై ఉత్కంఠత నెలకొంది.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు లైన్ క్లీయర్ .. ఆ హోదా వచ్చేసినట్లే..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju