NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

ఏలురే కాదు మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (2 పార్ట్ )

 

 

కాలుష్యం ఎలా జరుగుతుంది .. దేనివల్ల అనేది గత కథనంలో చర్చించాం కదా … ఎప్పుడు నీరు.. దానిలోని కారకాలు … వాటి వాళ్ళ వచ్చే వ్యాధుల గురించి ఒకసారి చూద్దాం రండి

ఏలురే కాదు…. మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (1 పార్ట్ )

C09GBD A bass fisherman casts for fish in the Toxic Blue Green Algae in the Copco Reservoir in Northern California

భార లోహాలు అనేవి ప్రతి కాలుష్యంలోను ఉంటాయి. అంటే నీరు కాలుష్యం అవుతుంటే ఖచ్చింతంగా దానిలో భార లోహాలు కలిసినట్లే.

** పాదరసం

ఇది చేరిన నీటిని తాగితే మినిమేటా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తొలిసారిగా జపాన్‌లో గుర్తించారు. శరీర అవయవాలు సరిగా పనిచేయకపోవడం, స్పర్శ, వినికిడి, దృష్టి మందగించడం; మాట పడిపోవడంతోపాటు జన్యు మార్పులు ఏర్పడతాయి.

** సీసం

ప్రగలనం జరిపే పరిశ్రమలు; బ్యాటరీ, రంగులు, రసాయనాలు, క్రిమి సంహారిణులను తయారు చేసే పరిశ్రమల నుంచి సీసం వెలువడుతుంది. వాహనాల పొగ ద్వారా లెడ్‌ వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. సీసం కలిసిన నీటిని తాగితే ఉత్పరివర్తనంతో పాటు తలనొప్పి, రక్తహీనత, కండరాలు బలహీనపడటం తదితర లక్షణాలు కనిపిస్తాయి.

** కాడ్మియం

ఇది లోహ పరిశ్రమలు, విద్యుత్‌ మలాము, పురుగు మందులు, ఫాస్ఫేట్‌లను తయారు చేసే పరిశ్రమల నుంచి వెలువడుతుంది. మూత్రపిండాలు, కాలేయం, ప్లీహం తదితర భాగాల్లో పేరుకుపోతుంది. దీంతో విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. రక్త పీడనం, రక్త హీనత, జరాయువు దెబ్బతింటాయి. కాడ్మియం ఆహారపు గొలుసులోకి ప్రవేశించి తద్వారా భూమిని తర్వాత వరి, గోధుమ మొదలైన పంటల్లోకి చేరుతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

** జింక్‌

దీని కాలుష్యం వల్ల వాంతులు వస్తాయి. విసర్జక వ్యవస్థ పనిచేయదు. కండరాలు సంకోచిస్తాయి.

** కోబాల్ట్‌

దీనివల్ల పక్షవాతం, అతిసారం, బీపీ తగ్గడం, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధులు ఏర్పడతాయి.

** ఆర్సినిక్‌

ఆర్సినిక్‌ కలిసిన నీటిని తాగితే నాడీ వ్యవస్థ, రక్త ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయి. మానసిక ఒత్తిడి; కాలేయ, మూత్రపిండ, ఊపిరితిత్తి సంబంధ వ్యాధులు వస్తాయి. జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడతాయి.
** రాగి, నికెల్, టైటానియం, క్రోమియం మొదలైన లోహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడి రక్త స్వభావంలో, ఎంజైమ్‌ల పనితీరులో మార్పు వస్తుంది. మూత్రపిండాల వాపునకు కారణమవుతాయి.

ఏలురే కాదు…. మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (1 పార్ట్ )

ఇవి మీకు తెలుసా ??

** కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్, డయేరియా, పచ్చ కామెర్లు, చర్మ వ్యాధులు. కలుషిత నీటిలో ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండటం వల్ల జలచరాలు నశిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 మిలియన్ల మంది పిల్లలు నీటి కాలుష్యం వల్ల కలిగే వివిధ వ్యాధులతో చనిపోతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూ్యహెచ్‌ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలకు సరైన తాగునీరు, పారిశుధ్యం అందుబాటులో లేదు.
** 80% నీటి కాలుష్యం.. మురుగు, కుళ్లిన పదార్థాల వల్ల ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 బిలియన్‌ టన్నుల పట్టణ వ్యర్థ పదార్థాలను దగ్గరలోని జలాశయాల్లో కలపడం వల్ల తీవ్ర నీటి కాలుష్యం ఏర్పడుతోంది. గంగా, యమునా నదులు ప్రపంచంలోనే అత్యంత తీవ్ర కాలుష్యానికి గురైనట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
** నీటి కాలుష్యం వల్ల మన దేశంలో ఏటా 1000 మంది చిన్నారులు చనిపోతున్నారు. రాజస్థాన్‌లో నీటి కాఠిన్యత వల్ల బాల్య మరణాలు సంభవిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో కలుషిత నీరు తాగి అనేక పశువులు మరణించాయి.
** తెలంగాణలోని నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో కలుషిత నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ కాలుష్యం వల్ల ప్రజలకు ఫ్లోరోసిస్‌ వ్యాధి వస్తోంది.
** తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ఫ్లోరోసిస్‌ ఉంది. డబ్లూ్యహెచ్‌ఓ ప్రకారం తమిళనాడులోని రాణిపేట్‌.. ప్రపంచంలోని అతి తీవ్ర కలుషిత ప్రదేశాల్లో ఒకటి. చెన్నైకి సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న ఈ పట్టణంలోని పరిశ్రమల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతోంది.
** జల కాలుష్య నియంత్రణ చట్టాలు: కేంద్ర ప్రభుత్వం 1974లో జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టాలను రూపొందించింది.

ఏలురే కాదు…. మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (1 పార్ట్ )

వీటిని గుర్తుంచుకుందాం

** జీవ ఆక్సిజన్‌ గిరాకీ
ప్రమాణ ఘనపరిమాణం గల నీటిలోని కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు వాయుయుత స్థితిలో జీవ రసాయన ఆక్సీకరణ చర్య జరుపుతాయి. ఇందులో వినియోగించుకున్న ఆక్సిజన్‌ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్‌ గిరాకీ అంటారు.
** యుట్రిఫికేషన్‌
టి మొక్కలు, ఆకుపచ్చ శైవలాలు, అకశేరుకాలు గుంపులుగా చేరి నీటిపై తెట్టులా తేలియాడుతుంటాయి. ఈ నీరు చిక్కపడి ఆకుపచ్చగా మారి దుర్గంధం వెదజల్లే స్థితిని యుట్రిఫికేషన్‌ అంటారు. దీనివల్ల నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గి జలచరాలు చనిపోతాయి.
** ఒలిగోట్రాఫికేషన్‌
కొత్తగా తవ్విన బావులు, చెరువులు, సరస్సులు మొదలైన జలాశయాల్లో నీరు నిలకడగా ఉండి నీటి మొక్కలకు, జలచరాలకు కావాల్సిన పోషక పదార్థాలు లేకపోవడం వల్ల నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ స్థితిని నీటి ఒలిగోట్రాఫికేషన్‌ అంటారు.
(నీటి కాలుష్యం తగ్గించాలి అంటే ఎం చేయాలి అనేది ఇటు ప్రభత్వాలకి తెలుసు… అటు ప్రజలకి బాగా తెలుసు.. కానీ అంతులేని నిర్లక్ష్యం.. మనది కాదు.. మనకేం అవుతుంది. అయినప్పుడు చూసుకుందాం లే అనే భావనతోనే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఎవరు ముందుకు రారు.)

ఏలురే కాదు…. మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (1 పార్ట్ )

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju