చిరంజీవి.. రజనీకాంత్..బాలకృష్ణ..ఇలా సీనియర్ స్టార్ హీరోలకి బెస్ట్ ఛాయిస్ గా క్రేజ్ ని సంపాదించుకుంది నయనతార. టాలీవుడ్..కోలీవుడ్ లో నయనతార కి అన్ని రకాలుగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. రెమ్యూనరేషన్ పరంగా నయనతార హాట్ టాపిక్ గా మారుంది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే మేకర్స్ కి ముందు నయనతార పేరే గుర్తొస్తుంది.
ఒకవైపు స్టార్స్ తో సినిమాలు..మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు..ఇవి కాకుండా తనవరకు ఏదైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్ వస్తే కూడా వదలడం లేదు. కథ..అందులో తన క్యారెక్టర్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనిపిస్తే రెడీ అయిపోతుంది నయనతార. ఈ క్రమంలో ప్రస్తుతం నయనతార ‘నేత్రికాన్’ ‘మూకుతి అమ్మన్’ అన్న విభిన కథాంశంతో రూపొందుతున్న సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘అన్నాత్తే’ సినిమాలోనూ నటిస్తుంది నయన్. ఈ సినిమా తెలుగులో అన్నయ్య పేరుతో రిలీజ్ కానుంది.
ఇక తాజాగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తుండగా… మరో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా నటించనుంది. ఈ నేపథ్యంలో ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో నటిస్తున్న నయనతార పాత్ర గురించి కోలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమాలో నయనతార అంధురాలిగా నటించనుందని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం నయన్ బాగా ప్రాక్టీస్ చేస్తుందట. ఇక నయన తార అకౌంట్ లో దాదాపు 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయట. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.