Ladies: ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలాంటి టాప్ వేసుకున్నా.. కామన్ గా మాత్రం లెగ్గిన్స్ ను వేసుకుంటున్నారు. ఎప్పుడూ కామన్ గా వేసుకునే ఈ లెగ్గిన్స్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలిసి ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.. లెగ్గిన్స్ కొనేటప్పుడు ఎదో ఒకటిలే అని కాకుండా వాటి క్వాలిటీ చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే లెగ్గింగ్స్ శరీరానికి సరిపోక ఇబ్బంది పడవలిసి వస్తుంది. లెగ్గింగ్స్ యొక్క పొడవు కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి..
లేకపోతే అవి వేసుకున్నప్పుడు షార్ట్ గా కనిపిస్తాయి . సన్నగా ఉండే లెగ్ ఫీట్ లెగ్గింగ్స్తీసుకునేటప్పుడు, దాని పొడవు మరియు ఫిట్టింగులను గమనించి తీసుకోండి. స్ట్రెచ్చింగ్ కోసం అయితే ఫర్మ్ లెగ్గింగ్స్ తీసుకోవాలి. లెగ్గింగ్స్ వేసుకున్నప్పుడు , మీరు వేసుకునే లోదుస్తులు మీద దృష్టి పెట్టడం అవసరం. మందం ఎక్కువగా గల లోదుస్తులను వేసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అవి లెగ్గింగ్స్ లో నుంచి బయటకు చాలా క్లియర్ గా కనపడే అవకాశం ఉంది. లెగ్గింగ్స్ వేసుకున్నప్పుడు.. స్టైలిష్ గా కనిపించేందుకు యాంకిల్ బూట్స్ లేదా స్నీకర్స్ లాంటివి వేసుకోవాలి.
లెగ్గింగ్స్ కొనుక్కొనేటప్పుడు.. స్టైలిష్ నియాన్ కలర్ లేదా పాప్ కలర్, లెదర్ లెగ్గింగ్స్ తీసుకోండి . లెగ్గింగ్స్ తొడుక్కున్నప్పుడు పైన షార్ట్ టాప్ మాత్రం వేసుకోకండి. ఇది మీ ఆకృతిని చెడగొట్టేస్తుంది. లెగ్గింగ్స్ పై ట్యూనిక్ లేదా పొడవాటి చొక్కా వేసుకుంటే కరెక్ట్ గా ఉంటాయి. యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి . వీటిపై న వేసుకోవడానికి పొడవైన కుర్తా చాలా బాగుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు పాటించి లేగిన్స్ వేసుకుంటే మీరింత అందం గా ఉంటాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?