Weight Loss: చెడు కొలెస్ట్రాల్
వాము వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణ సంబంధ సమస్యలను అరికట్టడం లో అతి ముఖ్యమైనది. మన శరీర బరువుకి కారణమైన కొవ్వును కరిగించడం లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.ప్రతి రోజు ఒక స్పూన్ వామును తినడం వలన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, రకరకాల ఇన్ఫెక్షన్లు దూరం గా ఉండవచ్చు.

కీళ్ల నొప్పులు
విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు వాములో పుష్కలం గా ఉంటాయి. తైమల్ అనే రసాయనం వాములో ఉండడం వలన బ్యాక్టీరియాను, ఫంగల్ వ్యాధులను అరికడుతుంది. వాము తలనొప్పి, మైగ్రేన్, అలసటకి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో వాము వాడడం వలన అజీర్తి సమస్యల తో పాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. వాము నుంచి తీసిన నూనెను కండరాల నొప్పులు,కీళ్ల నొప్పులు, ఉన్నవారు రాసుకోవటం వలన వెంటనే ఉపశమనం పొందవచ్చు. వాము రసం తో పాటు తేనె,పసుపు కలిపి తాగితే పడిశం, కఫం నుంచి విముక్తి దొరుకుతుంది. ఒక టేబుల్ స్పూన్ వాము తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయానే వాటిని మరిగించి చల్లార్చి పరగడుపున ప్రతి రోజు తాగితే శరీర బరువు తగ్గుతుంది.

Weight Loss: విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్
వాముమంచి సువాసనను కలిగి ఉంటుంది. వాములో ఉండే విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికిచాలా మేలు కలిగేలా చేస్తాయి. వాము తో ఆరోగ్యానికి ఎంత లాభామో వాము మొక్క ఆకులు వలన కూడా అదే విధం గా మంచి జరుగుతుంది. ప్రతి నెలలో ఒకసారి అయినా వాము పొడి కాని, వాము ఆకు కాని ఆహారం లో తింటే పొట్ట బాగా శుభ్రం అవుతుంది. ఈ వాము ఆకు ని వైద్యం కోసమే కాదు..ఆహారపదార్దం గా కూడా ఉపయోగించవచ్చు. వాము ఆకుతో బజ్జీలు చేసుకోవచ్చు, పెరుగు పచ్చడి చేసుకుని తిన్న కూడా చాలా రుచికరంగా ఉండడం తో పాటు అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి.