NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

మా కమిషనర్ మంచోడు

కోల్‌కతా, ఫిబ్రవరి 3: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికీ, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికీ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా తయారయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సమన్లకు స్పందించాల్సి ఉన్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌‌ కేంద్రంగా తాజా వివాదం తలెత్తింది. సిబిఐ విచారణకు భయపడుతున్నారని అర్ధం వచ్చేట్లు ఆయన కనబడకుండా పోయారన్న పుకార్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గట్టిగా ఖండించింది.

కమిషనర్ ఒక్కరోజు సెలవులో వెళ్లారు తప్ప ఆయన విధినిర్వహణకు వచ్చిన లోటేమీ లేదని పోలీసు శాఖ తెలిపింది. శారదా పోంజీ కుంభకోణం కేసుతో సహా పలు కేసుల్లో విచారణకు సహకరించాల్సిందిగా సిబిఐ ఆయనకు సమన్లు జారీ చేసింది.

నిన్న ప్రధాని కోల్‌కతాలో ఎన్నికల శంఖరావం పూరిస్తూ, మమతపై తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ అంటేనే మమత దీదీకి ఎందుకు భయమని ప్రశ్నించారు. ఆమెపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టారు.

ప్రధాని మోదీ వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. నేడు ఆమె తన రాజధానీ నగరం పోలీస్ కమిషనర్‌ను సమర్ధిస్తూ ట్వీట్ చేశారు. కొల్‌కతా కమిషనర్ ప్రపంచంలోనే ఉత్తమమైన అధికారుల్లో ఒకరని, ఆయనలోని ధైర్యం, నిజాయితీలను ప్రశ్నించలేమని, ఆయన 24గంటలు పని చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు.

నిన్న ప్రధాని విమర్శకు మమత దీటుగా జవాబు ఇచ్చిన తర్వాత కేంద్రం తరపున సిబిఐ వేధింపు కార్యక్రమాలు మొదలుపెట్టిందని తృణమూల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

బిజెపి అధిష్టానం చాలా నీచంగా రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. వారి లక్ష్యం కేవలం రాజకీయ పార్టీలే కాదు, పోలీసు వ్యవస్థను తమ అధీనంలో ఉంచుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను బిజెపి నాశనం చేస్తున్నారని  విమర్శించారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Leave a Comment