NewsOrbit
న్యూస్

West Bengal Politics: ఏపీ రాజకీయాలను తలపిస్తున్న పశ్చిమ బెంగాల్!మాజీ మంత్రిపై చోరీ కేసు నమోదు!!

West Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ ను తలపిస్తున్నాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తన స్పీకర్ చాంబర్లోని విలువైన సామగ్రినంతా సొంతూరు నర్సరావుపేట కు తరలించుకున్నారని ఆరోపణలు చేయడం,సీఐడీ విచారణ వరకు దారి తీయడం తెలిసిందే.తదుపరి పరిణామాల్లో కోడెల ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారు.ఇప్పుడు అదే తరహాలో పశ్చిమబెంగాల్ రాజకీయం సాగుతోంది.

West Bengal Politics Like AP politics!
West Bengal Politics Like AP politics

మాజీ మంత్రిపై చోరీ కేసు

నందిగ్రామ్ లో మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించిన ఆమె మాజీ సహచరుడు సువేందు అధికారిపై చోరీ కేసు నమోదైంది.మున్సిపల్ కార్యాలయం నుంచి లక్షల రూపాయల విలువైన సహాయ సామాగ్రిని సువేందు అధికారి,ఆయన సోదరుడైన మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ సుమేందు అధికారి అపహరించినట్టు ఫిర్యాదు రావడంతో కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు.పూర్బ్ మేదినీపూర్ జిల్లాల్లోని కంతీ మున్సిపల్ కార్యాలయంలో లక్షల రూపాయల విలువైన సామాగ్రిని సువేందు సోదరులు మే ఇరవై తొమ్మిదో తేదీన దొంగిలించినట్టు రత్నదీప్ మున్నా అనే మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఫిర్యాదు చేశారు. తనకు వ్యక్తిగత భద్రత కల్పిస్తున్న కేంద్ర బలగాలను ఉపయోగించి ఈ దొంగతనానికి వారు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ జూన్ ఒకటో తేదీన ఈ ఫిర్యాదు అందగా పోలీసులు నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు చేయటం ఇక్కడ గమనార్హం.

Read More: MP RRR Case: ఎంపీ రఘురామ ఐ ఫోన్‌పై ఏపీ సీఐడీ స్పందన ఇదీ..!!

మమతా బెనర్జీ టార్గెట్ గా సువేందు?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫోకస్ మొత్తాన్ని సువేందు మీదే పెట్టినట్లు కనిపిస్తోంది.ఇది అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన ఈ మాజీ మంత్రి మొన్నటి ఎన్నికల్లో బీజేపీలో చేరడమే కాకుండా మొన్నటి ఎన్నికల్లో మమతా బెనర్జీ పై ఒంటికాలిపై లేచారు.నందిగ్రామ్ లో ఏకంగా ఆమెను ఓడించారు.దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా దీదీ పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సువేందు ముఖ్యఅనుచరుడొకరిని చీటింగ్ కేసులో అరెస్టు చేయడం కూడా ఇక్కడ గమనార్హం. సువేందు ఇరిగేషన్ మంత్రిగా ఉండగానీటిపారుదల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి సువేందు అనుచరుడు రఖాల్ బేరా 2019లో రూ.2 లక్షలు తీసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. మొత్తంగా చూస్తే మమతా బెనర్జీ అన్నివిధాలుగా సువేందు వెంట పడుతున్నట్లు స్పష్టమవుతోంది.అయితే బిజెపి అగ్రనాయకత్వం అండదండలున్న సువేందు ఏవిధంగా ఈ కేసుల నుండి బయట పడతారో చూడాలి!

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!