Chiranjeevi : మెగా ఫ్యామిలీ లో దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోనే వారిది అతి పెద్ద కుటుంబం. ఇక వీరి మధ్య విభేదాలు ఉన్నాయని అప్పుడప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అయితే సమయం వచ్చినప్పుడు తామంతా ఒక్కటే అని…. ఒకరి కోసం ఒకరు నిలబడతారు. ఎవరి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా అందరూ కలిసి ఒకే చోట ఉంటారు.
తాజాగా నిహారిక పెళ్ళిలో కూడా మెగా ఫ్యామిలీ మొత్తం తలుక్కున మెరిసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాగబాబు ల తల్లి అయినటువంటి పుట్టినరోజు వేడుకలకు మళ్ళీ మెగా ఫ్యామిలీ మొత్తం కలిశారు. ఆమె పుట్టిన రోజు వేడుకలను ఇంట్లో అందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.
Chiranjeevi ఇంట్లోనే కూడిక….
ఇక ఈ ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావడం విశేషం. మామూలుగా పవన్కళ్యాణ్ ఫంక్షన్లకు ఎక్కువగా దూరంగా ఉంటూ ఉంటాడు. అయితే తన తల్లి పుట్టినరోజు వేడుకలు కాబట్టి అతను కూడా సంతోషంగా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. తన ముగ్గురు కొడుకుల మధ్య అంజనమ్మ నవ్వులు చిందించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?