NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు సినిమా

Vakeel Saab × AP Government : రాబోయే వందల కోట్ల సినిమాలకూ ఏపీలో టికెట్ రేట్లు 5, 10 కేనా..?

what about budget movies situation in ap

Vakeel Saab × AP Government : వకీల్ సాబ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం Vakeel Saab × AP Government కొత్త సినిమాకు మొదటి వారం, పది రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడం అనే పద్ధతి చెన్నై, బెంగళూరుల్లో ఎప్పటినుంచో ఉంది. ఆ విధానాన్ని తెలుగులో మొదటిగా చిరంజీవి 2005లో వచ్చిన జై చిరంజీవ సినిమాతో ప్రవేశపెట్టారు. అప్పట్లో సీడీ పైరసీని అడ్డుకునేందుకు.. మొదటి వారమే కలెక్షన్లు సాధించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. అయితే.. ఈ విధానం ఫెయిలయింది. 2009లో మగధీర తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. అప్పట్నుంచీ మొదటి వారం సినిమాలకు టికెట్ రేట్లను పెంచుతున్నారు. బాహుబలికి అఫిషియల్ గానే రూ.1000 పైగానే టికెట్ల రేట్లు పెంచారు. ప్రస్తుతం ఈ అంశం ఏపీలో వివాదమైంది.

what-about-budget-movies-situation-in-ap
what about budget movies situation in ap

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు ఏపీలో టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలపై అకస్మాత్తుగా బ్యాన్ విధించింది ప్రభుత్వం. ఇందుకు రాజకీయ కోణాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. నిన్నటి నుంచీ వైసీపీ వర్సెస్ ఫ్యాన్స్ తోపాటు పొలిటికల్ యుద్ధం జరుగుతోంది. బెనిఫిట్ షోలు వేసి టికెట్ల రేట్లు పెంచి ఎవరిని దోచేస్తారు.. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నాలుగు షోలే ఉండాలి.. టికెట్ ధరలు తక్కువుండాలి.. అని మంత్రి పేర్ని నాని అంటున్నారు. పెద్ద, చిన్నా అనే సమస్యే లేదు.. రీసెంట్ గా నితిన్ రంగ్ దే సినిమాకు కూడా మొదటి వారం రూ.200 టికెట్ అమ్మారు. 2020లో మహేశ్.. సరిలేరు, బన్నీ.. అల.. సినిమాలకూ టికెట్ 250కి పెంచారు. బెనిఫిట్ షోలు పడ్డాయి. అప్పడూ ఏపీలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే. అప్పుడు మంత్రిగారు, చట్టం ఎక్కడున్నాయనేది అభిమానుల ప్రశ్న.

 

ప్రతి సినిమాకు ఈ చర్యలెందుకు లేవనేది మరో ప్రశ్న. దీంతో.. పవన్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సినిమాను వాడుకుంటున్నారని విమర్శలు పోటెత్తాయి. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు ప్రభుత్వాలు, కోర్టుల అనుమతి లేకుండా జరగదు. అయినా.. ఉదయం 5 గంటల షోకి టికెట్లు అమ్మేశాక అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చి జాయింట్ కలెక్టర్లను రంగంలోకి దింపడమేంటో ప్రభుత్వానికే తెలియాలి. 5, 10 రూపాయలకే టికెట్లు అమ్మాలనే రూల్ తో.. ఆర్ఆర్ఆర్, సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్, కేజీఎఫ్2, పుష్ప.. సినిమాలు రిలీజ్ చేయగలరా? నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అవుతుందా? అప్పుడు కూడా మంత్రి గారు ఇదే మాట మీద ఉంటారా?

 

author avatar
Muraliak

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri