NewsOrbit
న్యూస్ సినిమా

ఏంటి అంజలి? మరీ ఇంత సన్నగా అయ్యావు?

షాపింగ్ మాల్ సినిమాతో తన చక్కని ప్రతిభను కనబరిచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ అంజలి. తెలుగు, తమిళ సినిమాలల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు ఈ భామ. కాగా జర్నీ మూవీలో అందరినీ ఆకట్టుకునేలా హావభావాలను పలికించి ఎంతో మంది అభిమానులను దక్కించుకుందీ ఈ భామ. ‘ నాకన్నీ అలా తెలిసిపోతాయంటూ’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేష్ సరసన నటించి అందరినీ మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బలుపు సినిమాలో రవితేజ పక్కన మెరిసారు.

ఆ తర్వాత ఈ అందాల రాశి తెలుగు, తమిళ సినిమాలో నటించారు. కాని ఆ సినిమాలేవీ ఆమెకు పేరును తీసుకురాలేదనే చెప్పుకోవచ్చు. కాగా రీసెంట్ గా నిశ్శబ్దం మూవీలో ఓ పాత్రను కూడా పోషించారు. అయినా ఆ సినిమాలో అంజలి పేరుకు మంచి పాత్రలో నటించినా ఆమె పర్ఫామెన్స్ ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇగ అంజలి సినీ ఇండస్ట్రీ ముచ్చట ఒడిసినట్టేనని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇంకేముంది దాంతో అంజలిపై కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ అసలు మీరేనా ఇలా తయారయ్యారని ప్రశ్నిస్తున్నారు.

ఆ ఫోటోలో అంజలి చాలా సన్నగా సన్నజాజిలా మారిపోయారు. బుద్దుగా ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి ఇలా జీరో సైజ్ లోకి రావడంతో ఎవరూ ఈమెను గుర్తుపట్టలేని విధంగా మారింది. అంజలీ మీరేనా ఇలా గుర్తుపట్టరాకుండా ఉన్నారని ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. కాగా ఎంత సన్నాగా తయారైనా పర్లేదు కాని అంజలి ముఖంలో కళ లేకుండా ఉంది. దీంతో ఆమెపై మరిన్ని కామెంట్లు చేస్తున్నారు. అచ్చతెలుగు అమ్మాయిలా డ్రెస్సింగ్ వేసుకున్నా ముఖంగా కాంతి కోల్పోయి కాంతి హీనంగా తయారయ్యారని నెటిజన్లు అంటున్నారు.

ఇలా సన్నజాజిలా మారడానికి కథానాయికలు వివిధ పాట్లు పడుతూ కళావిహీనంగా మారుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బొద్దుగా ఉండే ముద్దుగుమ్మలందరూ ఇలా జీరో సైజ్ లోకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాగా అంజలితో పాటుగా కీర్తి సురేశ్ కూడా ఈ జాబితాలో చేరారు. వారు ఇలా సన్నజాజిలా మారడం పట్ల తమ అభిమానులు నొచ్చుకుంటున్నారనే అనుకోవచ్చు. ముద్దుగా ఉండే ముద్దుగుమ్మలు ఉన్నఫలంగా ఇలా మారిపోతే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తమ అభిమానులు. సన్నగా మారినా వారి ముఖంలో కళ లేకపోవడం వల్ల అభిమానులు ఫీల్ అవుతున్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri