NewsOrbit
న్యూస్

KCR: టీఆర్ఎస్ లో ఆ నలుగురు పరిస్థితి ఏమిటి.. ? కేసిఆర్ ప్రాధాన్యత ఇస్తారా.. ? పక్కన పెడతారా..??

KCR: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ (Etela Rajendar)  ను ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలన్న కేసిఆర్ స్ట్రాటజీ వర్క్ అవుట్ కాలేదు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు మంత్రి హరీష్ రావుకు పూర్తి బాధ్యతలను కేసిఆర్ అప్పగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ గెలుపు ధీమా వ్యక్తం చేసేందుకు నలుగురు ముఖ్యనేతలను కేసిఆర్.. పార్టీలోకి చేర్చుకున్నారు. ఓ నేతకు అయితే వెంటనే ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇంకా ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి త్రిశంకు స్వర్గంలోనే ఉంది.

KCR: ఒకలా ఆలోచిస్తే మరోలా అయ్యింది

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ( KCR )  ఒకలా ఆలోచిస్తే రాజకీయం మరోలా అయ్యింది. కేసిఆర్ ఎంతో స్ట్రాటజీగా గేమ్ ప్లాన్ చేసినా ఈటల ముందు నిలవలేదు. హూజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికల్లో టీాఆర్ఎస్ గెలుపునకు చేసిన ప్రయత్నాలపైనా సమీక్షించుకుంటోందట. ఉప ఎన్నికలకు ముందు పలువురు కీలక నాయకులను టీఆర్ఎస్ గూటికి చేర్చుకుంది. హూజూరాబాద్ లో టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా కేసిఆర్.. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న నియోజకవర్గ ఇన్ చార్జి పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని పార్టీ కండువా కప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి 50వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయనను కేసిఆర్ పార్టీలోకి చేర్చుకున్న కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ కు లేఖ రాశారు. అయితే గవర్నర్ ఆ దస్త్రాన్ని పెండింగ్ లో పెట్టారు. ఇక పోతే హూజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్ రమణను ( L Ramana) , బీజేపీ నేత పెద్దిరెడ్డి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులును కేసిఆర్ పార్టీలో చేర్చుకున్నారు.

 

పార్టీలో ఈ నలుగురి పరిస్థితి ఏమిటి..?

ఎన్నో అంచనాలతో ఈ నలుగురు కీలక నేతలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నా హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు దళిత సామాజిక వర్గ ఓటర్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని దళిత బంధు అనే పథకాన్ని కేసిఆర్ ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చారు. అయితే ఈటల రాజేందర్ పై వచ్చిన సానుభూతి పవనాల ముందు ఇవేమీ వర్క్ అవుట్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఎంతో ఆశతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ నలుగురు నేతలకు పార్టీలో ప్రాధాన్యత కొనసాగుతుందా లేదా పక్కన పెడతారా అన్న దానిపైనా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కౌశిక్ రెడ్డి తో సహా ఎల్ రమణ, మోత్కుపల్లి నర్శింహులు ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. పార్టీలో తొలి నుండి ఉన్న వారికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీలు ఇస్తే సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నలుగురికి పార్టీ లో రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

 

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju