హీరోయిన్ అవ్వాలనుకున్న విద్యా బాలన్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడింది. చేతికి సినిమా వచ్చినట్టే వచ్చి జారిపోయింది. దాదాపు నాలుగైదు సినిమాలు ఇలానే జరిగాయి. అయినా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేసి పరిణీత సినిమాతో బాలీవుడ్ లో ఎంటరైంది. ఈసినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సంజదత్ నటించిన లగే రహో మున్నాభాయ్ సినిమాలో అవకాశం అందుకుంది. అంతే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఎన్నో మంచి సినిమాలు చేసింది. ప్రయోగాత్మక సినిమాలు ఒప్పుకుంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. అయితే విద్యాబాలన్ అందరినీ ఆశ్చర్యపరచింది మాత్రం డర్టీపిక్చర్ సినిమా ఒప్పుకొని. ఈ సినిమా కి సైన్ చేయడంతో బాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ అయింది. అప్పటి వరకు విద్యాబాలన్ చేసిన సినిమాలంటే కంప్లీట్ డిఫ్రెంట్ సినిమా..శృంగారతార సిల్క్ స్మిత బయోపిక్ అనగానే అందులో చాలామంది విద్యాబాలన్ ని ఊహించుకోలేపోయారు. ఒకటే విమర్శలు వచ్చాయి.
అయితే సినిమా రిలీజయ్యాక మాత్రం విద్యాబాలన్ పొగడని వారు లేరు. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గొప్ప గొప్ప మేకర్స్ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు డర్టీ పిక్చర్ విద్యాబాలన్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలబడింది. అయితే కొంతమంది మాత్రం నీకు పిచ్చా..ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకున్నావని కామెంట్ చేశారట. ఇన్నాళ్ళు హోంలీ క్యారెక్టర్స్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు ఇలాంటి పాత్ర చేస్తే జనాల దృష్ఠిలో నీ ఇమేజ్ మొత్తం మారిపోతుందని అన్నారట. కాని వాళ్ళే తర్వాత పొగిడారని వెల్లడించింది విద్యాబాలన్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?