Siddharth: “బొమ్మరిల్లు”సిద్ధార్థ్ కి ఏమైంది?ఈ ప్రేలాపనలు ఏమిటి?పిచ్చి పీక్స్ కు చేరిందా?

Share

Siddharth: బర్నింగ్ టాపిక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సినీ ప్రముఖుల్లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మొదటి వరుసలో ఉంటారు.ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించడానికి హీరో సిద్ధార్థ్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

What Happened to Hero Siddharth
What Happened to Hero Siddharth

హీరోగా ఇమేజ్ దాదాపు ఫేడవుట్ దశలో ఉన్న సిద్ధార్థ్ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తున్నారు.పైగా ఈ “బొమ్మరిల్లు” సిద్ధార్థ్ కామెంట్స్ పరిశీలిస్తే ఆయన స్త్రీద్వేషా అన్న అనుమానం కూడా కలుగుతోంది. సమంతతో ప్రేమ వ్యవహారం దెబ్బతినడం, మేఘనతో పెళ్లి కావడంతో సిద్ధార్థ పర్వర్టెడ్ గా మారిపోయాడా అనిపిస్తోంది.

Siddharth: సైనా నెహ్వాల్ పై అతి నీచమైన కామెంట్!

బ్యాడ్మింటన్ ఛాంపియన్,ముప్పయ్యేళ్ల వయసులోనే అద్భుతమైన రికార్డులు సృష్టించి పద్మభూషణ్ బిరుదు కూడా అందుకున్న సైనా నెహ్వాల్ నుద్దేశించి “సటల్ కాక్ చాంపియన్” అని సిద్ధార్థ కామెంట్ చేయడం అతడి నీచ ప్రవృత్తిని స్పష్టం చేసింది.కాక్ అన్న పదాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో అందరికీ తెలుసు.ప్రధాని మోడీ సెక్యూరిటీ లో జరిగిన లోపాలు వెలుగులోకి వచ్చాక సైనా నెహ్వాల్ స్పందించారు.ఒక ప్రధాని కి ఇలా జరగడం సరికాదని ఆమె ట్వీట్ చేశారు.మోడీ అంటే ఏమాత్రం పడని సిద్ధార్థ్ అందుకు కౌంటర్ ఇస్తూ సైనా మీద అలాంటి అసభ్యకరమైన భాష వాడారు.అయితే జాతీయ మహిళా కమిషన్ సిద్ధార్థ్ ట్వీట్ ను తీవ్రంగా పరిగణించి వివరణ కోరింది. అతడి ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయమని కూడా సిఫార్సు చేసింది.ఈ దశలో తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ‘కాక్ అండ్ బుల్’ పదాలకు అర్థాలకు తెలియని వారే ఇలా చేస్తారని సిద్ధార్థ్ కౌంటర్ ఇవ్వటం ఆయనఉన్మాదానికి అద్దం పడుతోంది

Siddharth: సమంత పైనా అక్కసు వెళ్లగక్కిన సిద్ధార్థ్!

ఇక నాగ చైతన్య సమంతలు విడిపోయాక కూడా సిద్ధార్థ్ తన అక్కసును వెళ్లగక్కాడు.”మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరని చిన్నప్పుడే మా టీచర్ చెప్పింది’’ అని సమంతను ఉద్దేశించి నర్మగర్భంగా ట్వీట్ చేశారు.అంతకుముందు టైమ్స్ నవ్ యాంకర్ నవీకా కుమార్ ఏదో ట్వీట్ చేస్తే… ఆమెను స్టూల్ కిట్, దుర్వాసనను పెంచుతోంది అని తిట్టిపోశాడు.దీని అర్థం మరీ దారుణంగా ఉంది.అలాగే బిజెపికి మద్దతుదారుగా ఉన్న సినీ నటి కంగనా రనౌత్ ను కూడా అతడు కెలికాడు.రంగనా ఎందుకు మోడీని రక్షించడానికి ఇంకా రాలేదని ఎగతాళి చేశాడు.ఇక ప్రధాని మోడీ సెక్యూరిటీ బ్రీచ్ విషయమై కూడా సిద్ధార్థ్ వెకిలి కామెంట్ పెట్టాడు.ఇది పెయిడ్ యాక్టర్స్ తో మోడీ ఆడిన డ్రామా అన్నట్లుగా ట్వీట్ వదిలాడు.మొత్తం మీద సిద్ధార్థ్ పిచ్చి పీక్స్ కు చేరిందని,ఎప్పుడో ఒకప్పుడు ఎదురుదెబ్బతగలక తప్పదని సినీ, రాజకీయ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.

 


Share

Related posts

బాబోయ్.. ఇదేం టేస్ట్ తల్లి.. మ్యాగీని ఇలా కూడా తింటారా?

Teja

చేసుకున్న వారికి చేసుకున్నంత… ఏబీ మీకు వర్తించేది ఇదే!!

Comrade CHE

Smart Watch : కొంపముంచిన స్మార్ట్ వాచ్.. అసలేం జరిగిందంటే..

bharani jella