Urvashi Rautela: టాలీవుడ్‌లో సత్తా చాటాలనుకున్న ఊర్వశీ రైతెలా ఆశలన్నీ ఏమయ్యాయి..?

Share

Urvashi Rautela: గత కొంత కాలంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న వారు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటాలని ట్రై చేస్తున్నారు. అలాగే ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న వారూ బాలీవుడ్..కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా పాపులారిటీ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రద్దా కపూర్ సాహో సినిమాతో మెప్పించలేకపోయింది. ప్రభాస్ సరసన నటించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈమెకి ఇక్కడ సరైన ఆదరణ దక్కలేదు. ఇందులో స్పెషల్ సాంగ్‌లో కనిపించిన శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ కూడా ఆకట్టుకోలేకపోయింది.

what happened urvashi-rautela-hopes on tollywood...?
what happened urvashi-rautela-hopes on tollywood…?

అంతక ముందు వచ్చిన కియారా అద్వానీ ఓ సినిమాతో భారీ హిట్ అందుకుంటే మరో సినిమాతో భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. దాంతో దాదాపు మూడేళ్లపైనే ఇక్కడ గ్యాప్ వచ్చింది. అదేకాదు ఆమె బాలీవుడ్‌లో బిజీగా ఉండటం కూడా ఓ కారణం. మళ్ళీ ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. ఇక ప్రభాస్ ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోణ్ టాలీవుడ్‌లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్‌తో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఎంతవరకు మనవాళ్ళను మెప్పిస్తుందో చూడాలి. అలాగే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో కృతి సనన్ కూడా మరోసారి టాలీవుడ్‌లో కాలుపెడుతోంది.

Urvashi Rautela: ఊర్వశీ రౌతెలాను ఏకంగా హీరోయిన్‌గా లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.

గతంలో ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 1 నేనొక్కడినే, నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలలో నటించి ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆమెకి బాలీవుడ్‌లో మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఈ కారణంగానే మళ్ళీ ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తూ మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇదే క్రమంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవాలని బాగా ట్రై చేస్తోంది. వాస్తవంగా హిందీలో మంచి క్రేజ్ ఉన్న ఈమెను అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెంగ్ సాంగ్ కోసం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. కానీ యంగ్ డైరెక్టర్ సంపత్ నంది బ్లాక్ రోజ్ అనే సినిమాతో ఊర్వశీ రౌతెలాను ఏకంగా హీరోయిన్‌గా లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది.

Urvashi Rautela: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి క్రేజ్ తెచ్చుకోవాలనుకున్న ఊర్వశీ ఆశలన్నీ ఎప్పుడు నెరవేరుతాయో..?

ఇందులో ఓ పాట కూడా రిలీజై మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంతవరకు అసలు క్లారిటీ రావడం లేదు. కరోనా వేవ్స్ కారణంగా బ్లాక్ రోజ్ రిలీజ్ కాకుండా ఆగిపోయింది. పాపం ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి క్రేజ్ తెచ్చుకోవాలనుకున్న ఊర్వశీ ఆశలన్నీ ఎప్పుడు నెరవేరుతాయో ఏమో. ఊర్వశీ రౌతెలా హిందీలో సనమ్ రే సినిమాతో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీస్ 4 లాంటి రొమాంటిక్ మూవీస్‌లో ఘాటు ఘాటు అందాలను ఆరబోసి బాగా పాపులర్ అయింది.


Share

Related posts

పోసాని ఆడ‌పిల్ల‌గా పుట్టి ఉండుంటే..

Siva Prasad

‘ ఆపరేషన్ సాయిరెడ్డి కారెక్టర్ ‘ – మొదలెట్టిన   విపక్షం + వైకాపాలో ఒక వర్గం 

sekhar

Bangaarraju: బంగార్రాజులో చైతు సరసన ఉప్పెన బ్యూటీ వద్దు..ఆమె కావాలంటున్న ఫ్యాన్స్

GRK