Bigg boss Rohini : బిగ్ బాస్ రోహిణి Bigg boss Rohini గురించి తెలుసు కదా. తను ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. బిగ్ బాస్ 3 సీజన్ లో వెళ్లడానికి ముందు తను సీరియళ్లలో నటించినప్పటికీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. తను ఎక్కడుంటే అక్కడ సందడే. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది బిగ్ బాస్ రోహిణి.

బిగ్ బాస్ 3లోకి తనకు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇక చూసుకోండి తన రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది రోహిణి.
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తనకు చాలా షోలలో ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. జబర్దస్త్, అదిరింది, బొమ్మ అదరింది, కామెడీ స్టార్స్ లాంటి కామెడీ షోలలో ఎప్పుడూ రోహిణి మెరుస్తుంది.
Bigg boss Rohini : షూటింగ్ లేకపోతే బిగ్ బాస్ రోహిణికి వాళ్లమ్మతో ఫుల్ టు టైమ్ పాస్
ప్రస్తుతం బిగ్ బాస్ రోహిణి ఫుల్ బిజీ. తనకు పలు షోలలో ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే.. తను సొంతంగా ఒక యూట్యూబ్ చానెల్ కూడా ఏర్పాటు చేసింది. యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ వీడియోలు, షూట్ వీడియోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటోంది రౌడీ రోహిణి.
అయితే.. ఒక్కరోజు తనకు షూట్ లేకపోతే రోహిణి ఏం చేస్తుందో తెలుసా? తనకు షూట్ లేకపోతే.. రోజంతా ఫుల్ బోర్ అట. కాసేపు సెల్ ఫోన్ తో కాలక్షేపం, ఆ తర్వాత వాళ్ల అమ్మతో కాలక్షేపం.. వాళ్ల అమ్మతో సరదాగా కాసేపు మాట్లాడటం.. ఆమెతో తన జెడకు నూనె పెట్టించుకోవడం, మర్ధన చేయించుకోవడం.. ఇవేనట షూటింగ్ లేకపోతే రోహిణీ చేసే పనులు.
దానికి సంబంధించిన వీడియోను తాజాగా రోహిణి తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది.