గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు స్ట్రాటజీ ఏమిటి…??

Share

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు స్ట్రాటజీ ఏమిటి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దాని విషయంలో బయట రకరకాల వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా బీజేపీకి చంద్రబాబు సపోర్ట్ చేయొచ్చని తద్వారా బీజేపీతో ఎప్పటినుండో కలవాలని అనుకుంటున్న నేపథ్యంలో…గ్రేటర్ ఎన్నికల వంకను బాబు వాడుకోవచ్చు అనే టాక్ వచ్చింది.

Haven't received any proposal from BJP for RS seat: Chandrababu Naiduఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను పార్టీ పరంగా ఎవరికీ అప్పగించాలి అనేదానిపై తీవ్రస్థాయిలో చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారట. దీనిలో భాగంగా దేవేందర్ గౌడ్ తో కలిసి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో దాదాపు 70 స్థానాలలో టీడీపీ.. బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ వస్తోంది.

 

చాలావరకూ బీజేపీతో కలవాలి అనుకుంటున్న చంద్రబాబుకి ఈ ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడనున్నట్లు తెలుగు రాజకీయవర్గాలలో టాక్. ఇదిలా ఉండగా నగరంలో ఐటీ ఉద్యోగులు టిడిపి పార్టీకి గట్టిగానే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇదే క్రమంలో జనసేన పార్టీ కూడా బిజెపి కి మిత్రపక్షంగా ఉంది. ఇలాంటి తరుణంలో దుబ్బాక ఉప ఎన్నికలలో ఊహించని విధంగా గెలవడంతో గ్రేటర్ లో గెలిస్తే బీజేపీకి తిరుగుండదని… కమల దళం సభ్యులు కూడా చంద్రబాబుతో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో గ్రేటర్ ఎన్నికల లో చంద్రబాబు తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తెలుగు రాజకీయాలలో కొత్త రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో చోటుచేసుకోవటం గ్యారెంటీ అని పరిశీలకుల మాట.


Share

Related posts

సీనియర్ రాజకీయ వేత్త, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయం

somaraju sharma

సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేస్తే పోలీసులు తాట తీస్తారా? బాబు చెప్పేదాకా తెలియదే… 

arun kanna

వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఎట్టకేలకు రంగంలోకి దిగిన సిబిఐ..!!

somaraju sharma