NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : ఢిల్లీ పర్యటనల్లో అసలు మతలబు లేంటి?

YS Jagan : ఢిల్లీ పర్యటనల్లో అసలు మతలబు లేంటి?

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jagan వైయస్ జగన్ పదే పదే ఢిల్లీ పర్యటనలో వెనుక అసలు విషయం ఏమిటి అన్నది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళుతూ బిజెపి పెద్దలను పదేపదే జగన్మోహన్ రెడ్డి కలవడం వెనుక ఉన్న అసలు రాజకీయాలు ఏమిటి అన్నది అంతుబట్టడం లేదు. బీజేపీ పెద్దలు ఆయనతో ఏకార్యం చేయించ బోతున్నారు? దాని వెనుక ఉన్న అసలు స్పీచ్ ఏమిటి అన్నది కూడా బయటపడటం లేదు. దీంతో జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి తప్పితే అసలు విషయం మాత్రం బయటకు రావడం లేదు. తాజాగా జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటికీ మోడీ అమిత్షాల అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది.

what is the cause behind jagan delhi tour
what is the cause behind jagan delhi tour

కచ్చితంగా రాజకీయ కారణాలే!

జగన్ ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల గురించి వారితో చర్చించినట్లు ఒక ప్రెస్ నోట్ మీడియాకు విడుదల అవుతుంది. దాని కోసమే ప్రత్యేకంగా జగన్ ఢిల్లీకి వచ్చినట్లు ఆ ప్రశ్న నోట్లో పేర్కొంటారు. అయితే అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ కు విభిన్నంగా రాజకీయ కారణాల వల్లనే జగన్ పదే పదే ఢిల్లీ పర్యటనలో చేస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం. అయితే రాష్ట్రంలో వైసీపీ పాలన మీద బీజేపీ రాష్ట్ర నాయకులు ఒకపక్క పోరాడుతుంటే, మరోపక్క కేంద్ర నాయకులు మాత్రం జగన్ను పదేపదే ఢిల్లీ పిలిపించుకోవడం తో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి బిజెపి నాయకులది.

** ప్రస్తుతం జగన్ అత్యవసర ఢిల్లీ పర్యటన వెనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక వ్యవహారం దాగి ఉంది అన్నది ఢిల్లీ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పదవీ విరమణకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇప్పటివరకు సుప్రీం కొలీజియం ఎవరిని ఆ పదవిలో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. దీంతో అత్యవసరంగా జగన్ ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడటంతో ఎన్.వి.రమణ విషయం మీద చర్చించే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. జస్టిస్ బాబ్డే తర్వాత సీనియార్టీ ప్రాతిపదికన ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉన్న ఎన్.వి.రమణ విషయంలో బిజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకంగా మారింది. న్యాయవ్యవస్థలో కి పాలనా వ్యవస్థ వచ్చి సీనియార్టీ ప్రాతిపదికన పక్కనపెట్టి బిజెపి తమకు అనుకూలమైన వారిని ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తే భవిష్యత్తులో ఇది కొత్త ఇబ్బందులకు వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. న్యాయపరమైన ఎంపికలోనూ పాలకొల్లు చేయి పెడితే అది కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది. దీంతో ఎన్.వి.రమణ కుటుంబ సభ్యుల మీద వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో బీజేపీ పెద్దలు జగన్ కు ఏమైనా గైడ్ చేయవచ్చని తెలుస్తోంది.

** ఇక ఇటీవల తిరుపతి పర్యటనను అర్థాంతరంగా వాయిదా వేసుకున్న అమిత్ షా తిరుపతి ఉప ఎన్నిక మీద కూడా జగన్తో చర్చించే అవకాశాలు లేకపోలేదు. తిరుపతి ఉప ఎన్నిక సీటును గెలవడం ద్వారా రాష్ట్రంలో బిజెపి సత్తా చాటాలని భావిస్తున్న కమలనాథులు ఆ సీటును వైసిపి బిజెపికి వదిలేసేల తెర వెనుక ఒప్పందం కుదుర్చుకుని అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ముఖ్యంగా టిడిపి ను రాష్ట్రంలో లేకుండా చేయాలంటే జగన్ కూడా బిజెపికి సాయం చేయాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రెండు కారణాలు కనిపించిన పైకి కనిపించని ఇంకా ఎన్నో కారణాలు జగన్ ఢిల్లీ పర్యటన ఉండవచ్చు అన్నది ఇరు పార్టీల నాయకుల మాట.

 

author avatar
Comrade CHE

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju