Jr NTR : పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ వ్యూహమేంటి..!? ఆ ప్రెస్ మీట్ సారాంశం ఇదే..!

junnior NTR
Share

Jr NTR : ఎవరు మీలో కోటీశ్వరులు” హోస్ట్ గా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఎన్టీఆర్ పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు తారక్ సమాధానం ఇచ్చాడు. కాగా, రాజకీయ ప్రవేశం గురించి ఓ మీడియా ప్రతినిధి ఎన్టీఆర్ ప్రశ్నించాడు.దానికి ఎన్టీఆర్ ఇలా సమాధానం ఇచ్చాడు. మీరు చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న అడిగారు, అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే.

What is the Jr NTR strategy on political entry ..!?
What is the Jr NTR strategy on political entry ..!?

రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడే సమయం, సందర్భం కాదు అని ఎన్టీఆర్ బదులిచ్చాడు. రాజకీయాల్లో ఎంట్రీపై త్వరలో మాట్లాడతానని చెప్పాడు.గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి హోస్ట్ గా ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ అంటూ అల‌రించారు. ఈసారి జెమినీ టీవీలో ‘కోటీశ్వ‌రులు ఎవరు మీలో’ పేరుతో మరో షో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ షోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ రోజు ప్రోగ్రాం ప్రోమోను యాజమాన్యం విడుద‌ల చేసింది.

Jr NTR : అభిమానులే నాకు గర్వకారణం!

ఈ సంధర్భంగా సోషల్ మీడియా ద్వారా టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తున్న సేవలపై విలేఖరి ప్రశ్నించగా.. అటువంటి కార్యక్రమాలు తనకు ఎంతో సంతోషం కలిగిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.
ప్రతి ఊరిలో టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తోన్న సేవల గురించి మాట్లాడుతూ.. నేను అభిమానులకు చేసేదానికంటే.. అభిమానులు నాకు చెయ్యడం చాలా ఎక్కువే అవుతోందని, నేను ఏరోజూ ఇలా చేస్తుంటే బాగుంటుంది అనలేదు.. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్లు అనుకుని చెయ్యడం వల్ల వచ్చిన మహోన్నతమైన కార్యక్రమం ఇది.. అంటూ తన అభిమానులను చేస్తోన్న కార్యక్రమాలను ప్రశంసించారు.

అమ్మ భార్య తరవాత అభిమానులే

మనుషులుగా సేవ చేస్తే కచ్చితంగా నాకు సంతోషంగానే ఉంటుంది.. అమ్మకు ఎంత చేసినా సరిపోదు.. భార్యకు ఎంత చేసినా సరిపోదు.. అభిమానులకు ఎంత చేసినా సరిపోదు.. కానీ ప్రతి అభిమాని కాలర్ ఎగరేసేలా కచ్చితంగా చేస్తా అని అన్నారు. అభిమానులను కాలర్ ఎగరేసుకునే లెవెల్‌లో మాత్రం కచ్చితంగా ఉంచుతానని, అభిమానుల నమ్మకాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వమ్ము చేయబోనని యంగ్ టైగర్ చెప్పుకొచ్చారు.ఇక ఇదే సమయంలో తాను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా లేనని.. కానీ నా అభిమానులు కోరుకునేది ఏమిటి అనేదానిపై మాత్రం కచ్చితంగా తెలుసుకుంటూ ఉంటానని అన్నారు.

కొత్త గెటప్ లో జూనియర్ !

‘కథ మీది-కల మీది. ఆట నాది- కోటి మీది’ అంటూ ఎన్టీఆర్ చెబుతున్న ప్ర‌త్యేక‌ డైలాగులు అల‌రిస్తున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో అది సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు. ఇందులో కొత్త గెట‌ప్‌లో తారక్ క‌న‌ప‌డుతున్నాడు.


Share

Related posts

సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇక లేరు

somaraju sharma

Nandamuri bala krishna : బిగ్ బ్రేకింగ్ : బాలయ్య అడ్డాలో వైసీపీ లీడర్ పై పోలీస్ కేసు !

somaraju sharma

పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ హీరోయిన్ ..?

GRK