ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరిగా పాడిన పాట ఏంటి?

దిగ్గజ దర్శకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తన పాటను మనకు వదిలి ఆయన మాత్రం వేరే లోకాలకు అక్కడ తన అమృతగానాన్ని పంచే పనిలో పడ్డారు. 55 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 40,000కు పైగా పాటలు. 16 భాషల్లో పాడిన ఒకే ఒక్క గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

 

what is the last song of SP Balasubrahmanyam
what is the last song of SP Balasubrahmanyam

 

అందుకే ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఒక గాయకుడు ఏడాదికి ఎన్ని పాటలు పాడగలడు? ఒక రోజుకొక పాట చొప్పున వేసుకున్నా ఏడాదికి సగటున 400 పాటలు అనుకున్నా 50 ఏళ్ల కాలానికి 20,000 వేల పాటలు మాత్రమే పాడగలరు. అయితే బాలు 40వేలకు పైగా పాటలు పాడారు. అయితే సగటున ఏడాదికి 1000 పాటలు 50 ఏళ్ల పాటు ఒకే ఫామ్ లో పాడినట్లు అన్నమాట. ఇప్పటి గాయకులతో బాలుకు అసలు పోలిక అన్నదే లేదు.

ఇప్పటి గాయకులు ఒక పాటను ఒక రోజులో అవ్వగొడితే చాలా గొప్ప. కొన్నైతే వారాలు కూడా పడతాయి. కానీ ఎస్పీ బాలు రోజులో 10 పాటలు రికార్డ్ చేసిన రోజులున్నాయి. అందుకే అనేది బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకులు మరొకరు రారు ఎప్పటికీ. 55 ఏళ్ల కాలంలో దాదాపు మూడున్నర దశాబ్దాలు ఎస్పీ బాలు ఒక ఊపు ఊపేసారు. సింగిల్ కార్డ్ అన్న పదానికి నిర్వచనంలా మారిపోయారు బాలసుబ్రహ్మణ్యం. 70లు, 80లు, 90లలో ఏ టాప్ సినిమా తీసుకున్నా బాలు, చిత్ర లేదా బాలు, సుశీల లేదా బాలు శైలజ ఇలా అన్నీ సింగిల్ కార్డులే.

బాలసుబ్రహ్మణ్యం శ్రీ శ్రీ మర్యాద రామన్నలోని ఏమి ఈ వింత మోహం అన్న పాట తన కెరీర్ లో మొదటిది. మరి ఎస్పీ బాలు చివరి పాట ఏది? తెలుగు వరకూ ఆఖరున రికార్డ్ చేసిన పాట అంటే డిస్కో రాజాలో నువ్వు నాతో ఏమన్నావో అనే పాట. అయితే పలాస 1978లోని ఓ సొగసరి పాట తర్వాత విడుదలైంది. ఇక రజినీకాంత్ తర్వాతి చిత్రం అన్నాతైలో పాట పాడారు. అది ఇంకా విడుదల కావాల్సి ఉంది.