సర్కారు వారి పాట ప్లాన్స్ అన్ని తారుమారు.. ఇదేం ట్విస్ట్ అసలు ..?

కోవిడ్ 19 తో చిత్ర పరిశ్రమ లో భారీగా మార్పులు జరిగాయి. చిన్న సినిమా నుంచి భారీ బడ్జెట్ సినిమా వరకు అన్నీ సినిమాల షెడ్యుల్స్ తారుమారయ్యాయి. ఇలా అయినా సినిమాలలో రాధేశ్యామ్ .. పుష్ప .. ఆర్ ఆర్ ఆర్ .. ఆచార్య .. లాంటి పలు సినిమాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట కూడా ఉంది. వాస్తవంగా సర్కారు వారి పాట అక్టోబర్ నెల నుంచే ప్రారంభం కావాలి. కానీ అలా అలా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తోంది. కాగా ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

Sarkaru Vaari Paata: That's A Big Twist!

అయితే ముందు సర్కారు వారి పాట షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అమెరికాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక త్వరలో అమెరికా షెడ్యూల్ కి బయలు దే శాలనుకున్న సమయంలో మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ మొదలవడం తో ఈ షెడ్యూల్ తాత్కాలికంగా ఆపేశారు. కానీ అందరూ మళ్ళీ సర్కారు వారి పాట షెడ్యూల్ అమెరికాలోనే మొదలవుతుందని భావించారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ లో భారీ మార్పులు చేసారాని సమాచారం.

ఈ క్రమంలో సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేయబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ బడ్జెట్ తో పెద్ద బ్యాంక్ సెట్ ని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి పర్యవేక్షణ లో నిర్మించారు. సినిమాలో కీలకమైన సన్నివేశాలను ఆ బ్యాంక్ సెట్ లో కంఫ్లీట్ చేయబోతున్నారట. జనవరి నుంచి షూటింగ్ మొదలవబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేశాకే అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేస్తారట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. థమన్ సంగీతమందిస్తున్నాడు.