Human: జీవిత పాటలను
ఆచార్య చాణుక్యుడు (Acharya chanukyudu ) రచయితా,ఆధ్యాత్మికగురువు, ఆర్ధిక వేత్తరాజకీయ వేత్త. ఆయన మేధాశక్తి .ఆచార్య చాణుక్య పేరు రాజకీయ చరిత్రలో కూడా సువర్ణ అక్షరాలతో రాయబడింది.ఆచార్య చాణుక్యుడికి విష్ణుగుప్తుడు,కౌటిల్యుడు( koutilyudu ) అని కూడా పిలుస్తారు. ఆయన ఎంతో మందికి విద్యాబుద్ధులు,జీవిత పాటలను నేర్పారు. ఆయనవి చాలా రచనలు కూడా ఉన్నాయి. అయన చెప్పినదాని ప్రకారం మనిషి మూడు విషయాలలో చాలా ఓపికగాఉండమని తెలియచేస్తున్నారు.
Human: తొందరపాటు లో
వాటిలో మొదటిది ఏ మనిషి డబ్బులు విషయంలో ఎంతమాత్రం తొందరపడకపోవడం మంచిది అని తెలియచేసారు. డబ్బు సంపాదనకు తొందర పడితే కనుక అది తప్పుడు మార్గం లో కి వెళ్ళడానికి కారణమవుతుంది. ఒక్కోసారి తొందరపాటు లో తీసుకునే,ఆలోచనలు , నిర్ణయాలు రకరకాల ప్రమాదాలకు కారణం అవుతుంది అని అంటున్నారు .అదే విధం గా డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా తొందరపాటు ఉండకూడదు. అలా తొందర పడితే ఆర్ధిక పరిస్థితి మరింత అగాధం లో పడే ప్రమాదం ఉందని చాణుక్య హెచ్చరిస్తున్నారు.
రుచికరంగా ఉంది
రెండోది మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎప్పుడు సహనంతో ఉండాలి.ఆహారం తీసుకునే విషయంలో ఎప్పుడు ప్రశాంతం గా ఉండాలి .రుచికరంగా ఉంది కదా అని బాగా ఎక్కువ ఆహారం తినకూడదు. ఎల్లవేళలా తేలిక పాటి ఆహారాన్ని తినేవిధంగా చూసుకోవాలి. ఎందుకంటే అవసరానికి మించి తిన్న ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
ఒక వ్యక్తి ఆత్రుత
ఇక మూడో విషయానికి వస్తే, మగవారి విషయంలో స్త్రీలు సహనంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ, పురుషులతో సాన్నిహిత్యం గా ఉండడానికి ఉత్సాహపడకూడదు. ఎల్లవేళలా ప్రేమ గౌరవంతో ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్రుత పడితే తన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవలిసిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆచార్య చాణుక్య వివరం గా తెలియచేసారు.