సింగపూర్ ఉప ప్రధానికి  లోకేష్ ఏమి చెప్పాడో

 

సింగపూర్ సహకారంతో అమరావతి వేగంగా అభివృద్ధి జరుగుతొందని ఏపి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి డిప్యూటి ప్రధాన మంత్రి షణ్ముగరత్నంతో సమావేశమైయ్యారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, నాలుగేళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. అభివృద్ధి అంతా ఒకే చోట కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళుతున్నాం. దేశంలోనే నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది. త్వరలో మరిన్ని నదులను అనుసంధానం చేస్తాం. విభజన సమస్యలు ఎదుర్కొంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. అధునిక టేక్నాలజీ అనుసంధానంతో వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి నిర్మాణం గురుంచి  వివరించారు.

అనేక రంగాల్లో సింగపూర్ అభివృద్ధి సాధించింది, మీ సహకారం ఉంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మరింత వేగంగా ఎపి అభివృద్ధి చెందుతుంది, త్వరలో అమరావతికి రావాలని ఆహ్వనం పలుకుతూ రాష్ట్రంలో పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వస్తాం, మా పూర్తి సహకారం అందిస్తామని సింగపూర్ ఉప ప్రధాని షణ్ముగరత్నం హామీ ఇచ్చారు.