రష్మిక ఏంటి పూజా హెగ్డేని కూడా తక్కువ చేసేసింది ..?

Share

టాలీవుడ్ లో ఇప్పుడు అవకాశాలన్ని పూజా హెగ్డే .. రష్మిక మందన్నలకే దక్కుతున్నాయి. ఈ బ్యూటీస్ నటించిన సినిమాలన్ని సూపర్ సక్సస్ అవుతున్నాయి. లక్కీ హీరోయిన్స్ అన్న పేరుంది. టాలీవుడ్ స్టార్ హీరోలకి బాగా కలిస్తోస్తుంది. దువ్వాడ జగన్నాధం సినిమా నుంచి టాలీవుడ్ లో పూజా హెగ్డే వరసగా పెద్ద నిర్మాణ సంస్థల లోనే అవకాశాలు అందుకుంటుంది. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో … ఇలా పూజ నటించిన సినిమాలన్ని భారీ హిట్స్ అందుకున్నాయి.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ లో నటిస్తుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అంతేకాదు పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమా హిట్ అయితే ఇక టాలీవుడ్ లో పూజా కి మరో నాలుగైదేళ్ళు డోకా ఉండదు. ఈ సినిమాతో పాటు అఖిల్ అక్కినేని కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా కూడా చేస్తుంది. అలాగే మరికొన్ని తెలుగు సినిమాలు సైన్ చేసిందని అంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో కూడా 3 భారీ ప్రాజెక్ట్స్ కమిటయింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో 2 కోట్లు.. బాలీవుడ్ లో 2.5 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం.

అయితే పూజా హెగ్డే కి రష్మిక మందన్న కూడా ఏమాత్రం తీసిపోలేదు.. తగ్గడం లేదు. నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక కొద్దికాలంలోనే స్టార్స్ తో నటించే ఛాన్సెస్ అందుకుంటోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి భారీ సక్సస్ అందుకుంది. అలాగే నితిన్ తో భీష్మ .. విజయ్ దేవరకొండ తో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్స్ రష్మిక అకౌంట్ లో ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా 5 భాషల్లో రిలీజవబోతుంది.

Tollywood: No competition for Rashmika Mandanna in Pushpa

ఈ సినిమాలతో పాటు మరికొన్ని టాలీవుడ్ .. కోలీవుడ్ సినిమాలు ఒప్పుకుందని సమాచారం. అయితే పూజా కంటే రష్మిక ఎంట్రీ లేట్ గా జరిగినా పూజా తో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటోందని అంటున్నారు. రష్మిక కి ఉన్న క్రేజ్ వల్ల తనకి టాలీవుడ్ సినిమాలలో 2 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంతకంటే తగ్గితే నిర్మొహమాటంగా నో అంటుందట రష్మిక. అవసరమైతే సినిమా వదులుకుంటుందట గాని రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటుందట. మొత్తానికి ఒకరకంగా చూస్తే పూజా హెగ్డే ని రష్మిక బాగానే డామినేట్ చేస్తుందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట.


Share

Related posts

ఏప్రిల్ నెలలో కూడా కొనసాగుతుందా వేతనాల కోత?

Siva Prasad

మీరు కానీ, మీభాగస్వామి కానీ.. ఇలా చేస్తే సంతాన లేమి సమస్య ఎదుర్కుంటారు!!

Kumar

ఏపీ లో హాట్ టాపిక్ : హై కోర్టు లో డీజీపీ !!

sekhar