ప్రకాష్ రాజ్ మాట్లాడినదాంట్లో నిజముంది.. పవన్ కళ్యాణ్ అలా చేసుండకూడందంటున్నారు.. !

సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే. తెరమీద నటించే వారిని నటులు అంటే, రాజకీయ రంగంలో కూడా అంతకు మించి నటులు ఉన్నారు. వీరు నిత్యం నటిస్తూనే ఉంటారు. ఇక చిత్రపరిశ్రమలో పేరు వచ్చిన తర్వాత రాజకీయప్రవేశం చేసిన వారు ఎందరో ఉన్నారు. అందులో కొందరు తమ రాజకీయ జీవితాన్ని విజయపధంలో నడిపించుకుంటే మరి కొందరు మాత్రం అలా మిగిలిపోయారు. ఇక రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాలు ఉండటం సర్వ సాధారణం.

Pawan Kalyan is an Oosaravelli: Prakash Raj

కానీ ఇప్పుడు రాజకీయాల పై నటీనటులు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరకంగా వారు చేసే విమర్శలు ఒక్కోసారి తారా స్దాయికి చేరుకుంటున్నాయి. ఇదిగో ప్రస్తుతం ఇలాంటి దుమారమే చెలరేగింది. పవన్ పూటకో మాట మార్చే ఊసరవెల్లి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. అసలు పవన్ కళ్యాణ్‌కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదు… పవన్ రాజకీయ నిర్ణయాలపై చాలా నిరుత్సాహం చెందాను.

నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి..? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు, వాళ్లు ద్రోహులు అన్నారు. మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు.. అంటు పవన్ కళ్యాణ్ ని ఇద్దేశించి అన్నారు. ఇలా మూడు, నాలుగు సార్లు మాటలు మారుస్తుంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా అని ఘాటుగా విమర్శించారట ప్రకాష్ రాజ్. మరి ప‌వ‌న్‌ని ప‌ల్లెత్తు మాట అన్నా.. ఆయ‌న అభిమానులు ఊరుకోరు. తాజాగా ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల్ని వాళ్లు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇక మరో వర్గం వారు మాత్రం ప్రకాష్ రాజ్ మాట్లాడినదాంట్లో నిజముంది.. పవన్ కళ్యాణ్ అలా చేసుండకూడదని మాట్లాడుకుంటున్నారట.