NewsOrbit
న్యూస్

ఒక మహిళ మరణానికి కారకుడైన ఈ మున్సిపల్ కమిషనర్ ని ఏం చెేయాలి?

అధికారం ఉంది కదా అని ఒక మున్సిపల్ కమిషనర్ తీసుకున్న రుబాబు చర్య ఒక మహిళ ప్రాణాలను బలిగొంది సంగారెడ్డి జిల్లా  నారాయణఖేడ్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది .కేవలం మున్సిపల్  అధికారుల తీరే ఆ మహిళ ప్రాణం తీసింది.

సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి ఇంటి  టాక్స్  కట్టలేదన్న  కారణంతో  మూడ భూమమ్మ  ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది  చెత్త వేశారు. ఈ వీడియోను  వాట్సప్ లో  సర్క్యులేట్ చేశారు. అవమానం భరించలేకపోయిన  భూమమ్మ  తీవ్రమనస్తాపానికి  లోనైంది. ఆదివారం ఉదయం ఆమె హాస్పిటల్ కు తరలించేలోపే  కన్నుమూసింది. కాగా ఈ వ్యవహారంలో నారాయణ్ ఖేడ్  మున్సిపల్ కమిషనర్  శ్రీనివాస్, సిబ్బంది తీరుపై  జనం మండిపడుతున్నారు.నారాయణ ఖేడ్  మున్సిపల్  అధికారుల తీరే  ఈ దారుణానికి  కారణంటున్నారు స్థానికులు.

అసలేం జరిగిందంటే మూడ భూమమ్మ,  ఆమె కుటుంబసభ్యులు… మున్సిపల్  అధికారులను  కొద్దిరోజుల కింద.. రోడ్డు  వెయ్యమని  అడిగారు. దీంతో… మున్సిపల్  అధికారులు  సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ముందు  ప్రాపర్టీ టాక్స్  కట్టాలని అడిగారు. కరోనా టైంలో  తమకు ఆదాయం లేకుండా  పోయిందని.. ఇప్పట్లో   కట్టలేమని బాధితులు  మున్సిపల్ అధికారులతో చెప్పారు. ఐతే.. కఠినంగా  వ్యవహరించిన  మున్సిపల్ కమిషనర్  శ్రీనివాస్.. వారి ఇంటి ముందు చెత్త వేయించారు. టాక్స్  కట్టకపోతే   ఇళ్లముందు  చెత్త వేస్తామంటూ  దానిని వీడియో తీసి.. వాట్సప్ గ్రూప్ లలో  సర్క్యులేట్ చేశారు.

దీంతో.. భూమమ్మ  కుటుంబం  తీవ్ర మనస్తాపానికి లోనైంది.ఇంటి ముందు  చెత్త వేసిన  తర్వాత.. తమకు  అందరికీ  జ్వరాలు వచ్చాయని  బాధిత కుటుంబసభ్యులు  చెబుతున్నారు. అప్పటికే  తీవ్ర ఒత్తిడిలో  ఉన్న భూమమ్మ కూడా అస్వస్థతనకు  లోనైందని…. హాస్పిటల్ కు  తరలించే  లోగానే.. ప్రాణాలు విడిచిందని అంటున్నారు.పేదల పట్ల కనికరం చూపాల్సిన అధికారులు కాఠిన్యం ప్రదర్శిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి.ఇప్పుడు ఆమె ప్రాణాలను కమిషనర్ తీసుకురాగలరా అని ప్రజలు నిలదీస్తున్నారు!ఈ సంఘటన దుమారం రేపే సూచనలు గోచరిస్తున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju