ఒక్క రోజు సరిగా నిద్రలేకపోయినా, పని ఒత్తిడి పెరిగినా.. ఇలా కారణం ఏదైనా ముందు వచ్చేది తలనొప్పే. ఇది వినడానికి చిన్నపదమే అయిన బాధ మాత్రం ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి తరచుగా అధిక పని, ఉద్రిక్తత, దీర్ఘకాలిక ఒత్తిడి వలన వస్తుంది.ఇందులో ప్రైమరీ,సెకండరీ రకాలు ఉంటాయి.సాధారణ పని ఒత్తిడి, మైగ్రేన్ ఇవి ప్రైమరీ.సెకండరీ విషయానికొస్తే బి.పీ, పంటి నొప్పి , జ్వరం, చెవిలో ఇన్ఫెక్షన్స్,ట్రూమెర్ ఇలాంటివాటి వలన వస్తుంది.
అన్నిపరీక్షలు చేసిన కొంతమందికి తలనొప్పి వస్తుంటే అది ప్రైమరీ.మైగ్రైన్ తలలో ఒక వైపు లేదా రెండువైపులా వస్తుంటుంది. ఇది బాగా ఎక్కువగా ఉన్నపుడు వెలుతురు చూసిన, శబ్డం విన్న చికాకుగా ఉండడం, వాంతులు అవడం జరుగుతాయి. కొంతమందికి సరైన టైంకి తినకపోతే వస్తుంది అప్పుడు సమయానికి ఆహారం తీసుకోవాలి. కొంతమందికి నిద్ర సమయానికి పోకపోతే వస్తుంది.మరికొంతమందికి పసుపు రంగు ఆహారం తీసుకోవడం వల్ల, ఘాటైన సువాసనల వలన వస్తుంది. ఎందువల్ల నొప్పి వస్తుందో అవి చేయకుండా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చని నీళ్ళల్లో అరగంటసేపు ఉంచటం వలన ఉపశమనం పొందవచ్చు.
ఇలాకాకుండా ఇప్పటివరకు తలనొప్పి లేనివారికి వస్తున్నా, ఉన్నవారిలో అధికమైన,రాత్రి ఘాడమైన నిద్రలో మధ్యలో తలనొప్పి బాధించి మెలుకువ వచ్చిన, ఒక వస్తువు రెండులా కనిపించిన, తలనొప్పితో వాంతులు అయితే ఖచ్చితంగా డాక్టరును సంప్రదించాలి.