Online: ఇప్పుడు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు అన్ని ఆన్లైన్ లో నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆన్లైన్ లో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.దానికి కారణం ఏమిటంటే, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో మనం చేసే ఒక చిన్న తప్పు, పెద్ద నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ అమౌంట్ ట్రాన్స్ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే బ్యాంక్ కు వెళ్లి ఆ తప్పును సరిచేసుకునే అవకాశం ఉంది.
అన్నిటికన్నా ముఖ్యంగా, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి .
IFSC కోడ్ కూడా మీ ట్రాన్సాక్షన్ ను ప్రభావితం చేయగలరని గుర్తు పెట్టుకోండి. అనుకోకుండా మీ డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ చేయబడితే ఏమి చేయాలి? అనేది తెలుసుకుందాం తెలుసుకుందాం.
ఒకవేళ తప్పుగా ట్రాన్సాక్షన్ జరిగితే ముందు డైరెక్ట్ గా మీ బ్యాంకు కు వెళ్ళాలి.
2. మీకు సంబంధించిన పూర్తి వివరాలను ఆపరేషన్ మేనేజర్ కు తెలియజేయండి.
3. ఇలా చేయడం వలన బ్యాంక్ ఆపరేషన్ మేనేజర్ మీకు వీలైనంత సహాయం చేయగలుగుతారు.
4. వీటితో పాటు మీరు తప్పు గా డబ్బు పంపిన బ్యాంకు కి వెళ్లి అక్కడ మేనేజర్ ని కలిసి వివరాలు తెలియజేయండి.
ఆ తర్వాత ప్రతి రోజు మీ బ్యాంక్ కస్టమర్ కేర్ ని సంప్రదించి వివరాలు తెలుసుకుంటూ ఉండటం అవసరం.
ఈ పద్దతిలో వెళ్తే కనుక, డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ చేసిన తిరిగి పొందవచ్చు.