NewsOrbit
న్యూస్ హెల్త్

Chewing Gum : పొరపాటున చూయింగ్ గమ్ మింగేస్తే వెంటనే  ఏం చెయ్యాలి???

Chewing Gum : చిన్న పిల్లలను చూయింగ్ గమ్ తినవద్దని పెద్దలు వారిస్తూ ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి చూయింగ్ గమ్ మింగేస్తే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఎన్నో కథనాలు వినే ఉంటాం. ఈ విషయమై ఎన్నో రకాల అపోహలు ప్రజలలో ఉన్నాయి.

అందులోనూ ముఖ్యంగా చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే అది కడుపులో పేగులకు చుట్టుకుపోతుందని కడుపులో అలాగే ఉండిపోతుందని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పి భయపెడుతూ ఉంటారు. ఇంతకీ అసలు చూయింగ్ గమ్ మింగేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా??

What to do immediately if chewing gum is swallowed by mistake ???
What to do immediately if chewing gum is swallowed by mistake ???

సాధారణంగా చూయింగ్ గమ్ లు ఎలాస్టిక్ గుణం కలిగి ఉంటాయి కాబట్టి ఇవి త్వరగా అతుక్కుపోతాయి. మనం వాటిని గంటల తరబడి నమిలినా వాటి పరిమాణం లో ఏమాత్రం మార్పు రాకపోవడానికి కారణం అదే. నిజానికి చూయింగ్ గమ్స్ ని మన శరీరం అరిగించుకోలేదు. కానీ చూయింగ్ గమ్ పొట్టలోని చాలా కాలం ఉండిపోతుంది అనేది మాత్రం నిజం కాదు.

మనం తీసుకునే ప్రతి ఆహార పదార్దాన్ని అరిగించేందుకు మన  పొట్ట జీర్ణాశయం ఎంజైమ్స్ ను విడుదల చేస్తుంది. ఆ ఎంజైమ్స్ మన పొట్టలోని  ఆహారాన్ని అరిగించి పోషకాలుగా మర్చి రక్తంలోకి ప్రవేశింపజేసి శరీరానికి శక్తిని ఇస్తుంది. అలాగే అరగని కొన్ని ఆహార పదార్థాలు పేగుల ద్వారా మలం రూపంలో శరీరంలో నుంచి బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా  చూయింగ్ గమ్ ని అరిగించుకునే శక్తి మన శరీరానికి లేకపోవడంతో చూయింగ్ గమ్ మిగిలిన జీర్ణం కాని ఆహారంతో పాటుగా  మలం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది.

అయితే  చూయింగ్ గమ్ కి ఇలా శరీరం నుంచి బైటకు వెళ్లడానికి కేవలం 12 నుంచి 48 గంటల సమయం పడుతుంది.. కొన్ని సందర్భాలలో రోజుల సమయం కూడా పట్టవచ్చు. అంతే తప్ప సంవత్సరాల పాటు చూయింగ్ గమ్ మన శరీరంలో నిల్వ ఉండదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా అనుకోకుండా చూయింగ్ గమ్ మింగినట్లైతే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సరి….

 

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju