NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

సీఎం X న్యాయవ్యవస్థ : బీజేపీ చోద్యం చూస్తుందా..? చక్కదిద్దుతుందా..!?

ఓ రాష్ట్రం ప్రభుత్వం న్యాయవ్యవస్థపై పోరాటం మొదలు పెట్టింది..! హైకోర్టులో న్యాయమూర్తులకు బురద పూసింది..! సుప్రీంలో కీలక న్యాయమూర్తిని బురదలోకి లాగింది. తీవ్ర ఆరోపణలు చేసింది..! ఈ వివాదం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఇలా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య పోరు మొదలయింది. ఏ పోరులో అయినా గెలిచేది ఒకరే. కానీ.., ఇక్కడ ఎవరు ఓడినా అది ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ. అంటే ప్రజలకే నష్టం..!! మరి పెద్దన్నగా పరిష్కరించాల్సిన కేంద్రం ఏం చేస్తుంది..? సరిదిద్దుతుందా..? సరదా పడుతుందా..!? చక్కదిద్దితుందా..? చోద్యం చూస్తుందా..!? ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు బీజేపీ పెద్దల పాత్ర కీలకం..!!

జగన్ ఇంత వరకు ఎలా వచ్చారు..!?

సీఎం జగన్ ఓ రిస్కీ గేమ్ మొదలు పెట్టారు. కీలక వ్యవస్థలో కీలక స్థంభం లాంటి వ్యక్తితో ఢీ కొట్టారు..! అయితే ఇది బీజేపీ పెద్దలకు చెప్పి చేశారా..? అనుమతితో చేశారా..? ఏకాభిప్రాయంతో చేశారా..? అనేవి రాష్ట్ర భవిష్యత్తుకి ముడిపడిన కీలక అంశాలు. బీజేపీకి చెప్పి చేస్తే ఒకలా.., అనుమతితో చేస్తే ఒకలా.., ఏకాభిప్రాయంతో చేస్తే మరోలా ఏపీలో పరిణామాలు జరగనున్నాయి అనేది మాత్రం స్పష్టం..!
* సీఎం జగన్ గత నెల అంటే సెప్టెంబర్ 23 , 24 న వరుసగా రెండు సార్లు అమిత్ షాని కలిశారు. నిజానికి ఆయనను ఒక్కసారి కలవడమే ఎక్కువ అనుకున్న తరుణంలో వరుసగా రెండు రోజులు, రెండు సార్లు వీరి భేటీ జరగడం ఓ పెద్ద అంశమే కదా.!!

Justice NV Ramana: in Confusion about his First Case?

* ఆ భేటీ జరిగిన పది రోజుల్లోపే ప్రధాని మోదీని కలిశారు. అప్పుడే ఏదో జరుగుతుంది..! సంచలమే అంటూ చర్చ జరిగింది. అన్ని మీడియాలు, విశ్లేషకులు జగన్ ఎన్డీఏలో చేరడానికి అనుకున్నప్పటికీ “న్యూస్ ఆర్బిట్” మాత్రమే జస్టిస్ ఎన్వీ రమణ గురించి అంటూ కీలక అంశాన్ని ముందే బ్రేక్ చేసింది.
* సో…! లాజికల్ గా ఆలోచిస్తే.. వైసీపీ- బీజేపీ బంధం బలపడిన నేపథ్యంలో.., జగన్ బీజేపీ పెద్దలను రెండు సార్లు కలిసిన నేపథ్యంలో.., వారు దగ్గర ఏపీలో హైకోర్టు తీర్పులు ప్రస్తావిస్తూ.. వాటి వెనకున్నారని భావిస్తున్న జస్టిస్ రమణ అంశం కచ్చితంగా మాట్లాడే ఉంటారు కదా..! అయితే ఇక్కడ పాయింటు ఏమిటంటే..? జగన్ లేవనెత్తిన ఈ అంశానికి బీజేపీ వారు ఒప్పుకున్నారా..? నిరాకరించారా..? ఏకాభిప్రాయం వ్యక్తం చేశారా..? అనేది కీలకం..!!

కీలక పెద్దోళ్ళు చూస్తూ ఊరుకోరుగా..!!

జగన్ ఇప్పటికే న్యాయవ్యవస్థలో కొందరికి శత్రువయ్యారు. ఈ తాజా అడుగుల కారణంగా ఆయనకు శత్రువుల సంఖ్య పెరిగింది. జగన్ కి ఉన్నబలం కేవలం ప్రజాబలం.., ప్రజాప్రతినిధుల బలం, శాసనబలం మాత్రమే..! న్యాయవ్యవస్థలో పెద్దలతో ఢీ కొట్టాలి అనే ఈ బలాలు సరిపోవు. కొన్ని తప్పులు వెతికి, ప్రాధమిక ఆధారాలు సేకరించి, పిర్యాదు చేసేస్తే విషయం ఆగదు. కేంద్రం మద్దతు ఉండాలి. కేంద్రంలో వ్యవస్థలను శాసించగలిగిన స్థాయిలో ఉన్న బీజేపీ పెద్దోళ్లతో ఏకాభిప్రాయంతోనే చేయాలి. అప్పుడే జగన్ అనుకున్నది నెరవేరుతుంది. లేకపోతే ఆ వ్యవస్థలోని పెద్దోళ్ళు చూస్తూ ఊరుకోరు.

ఏపీ భవిష్యత్తు కీలకం..! ఏం జరగనుంది..!?

బీజేపీ స్పందనపైనే ఇప్పుడు ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ బీజేపీ ఏం చూసీచడనట్టు ఉంటె.., పైన చెప్పుకున్నట్టు న్యాయవ్యవస్థలో పెద్దోళ్ళు ఊరుకోరు. అదే జరిగితే ఏపీలో పెద్ద సంక్షోభానికి దారి తీస్తుంది. ఒక రకమైన అశాంతత, అభద్రత కూడా అలముకుంటాయి. ప్రజా జీవనంపై ప్రభావం పడుతుంది. రాజకీయ ప్రకంపనలు వస్తాయి. కానీ..! ఒకవేళ బీజేపీ గట్టిగా పట్టుకుంటే.., వాళ్ళు అనుకుంటే రెండు వ్యవస్థల మధ్య రాజీ కుదిర్చే అవకాశమూ ఉంది. వివాదాన్ని ముగించేసే శక్తి ఉంది. కానీ..!! బీజేపీ అంటేనే అవకాశం వాదం. “మాకేంటి..? అహా మాకేంటయ్యా..? అనే టైపు. మరి ఇక్కడ కూడా ఈ రెండు వ్యవస్థల్ని రాజీ కుదిర్చితే తమకు లాభమో.., ఇలాగే వదిలేస్తే లాభమో.., కొన్నాళ్ళు కొనసాగనీ అనుకుంటే లాభమో… అనేది బేరీజు వేసుకుని.., వ్యవస్థల మధ్య తులాభారం వేసి…, కాషాయం పండేలా నిర్ణయం తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు..! అసలే అది “నరేంద్రామితీయం”..!!

 

 

author avatar
Srinivas Manem

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk