NewsOrbit
న్యూస్

రేపు ఏం జరగబోతుంది..!? కాంగ్రెస్ లో కీలక పరిణామాలు..!?

సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి, ఆ తర్వాతి కాలంలో సొంత నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్న అసమ్మతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు జరగాలని, సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలంటూ గత ఆగస్టులో గులాంనబీ ఆజాద్‌, కపిల్‌ సిబాల్‌లతోపాటు 23 మంది నేతలు ఏకంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.అయితే, లేఖ రాసిన అసమ్మతివాదులతో శనివారం సోనియా గాంధీ సమావేశం కానున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆధ్వర్యంలో వీరు సోనియాతో భేటీ కానున్నారని సమాచారం. అసమ్మతి నేతలతో సయోధ్య కోసమే అధిష్ఠానం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కోల్పోయాక, బీహార్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దయనీయ పరిస్థితికి దిగజారింది.

పార్టీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కపిల్ సిబల్ వంటి నేతలు బాహాటంగానే అంటుండగా, పి.చిదంబరం వంటివారు కూడా మెల్లగా అదే టైపు గళమెత్తుతున్నారు. ఈ సమయంలో రెబల్స్ తో సోనియా జరుపుతోన్న సమావేశం పార్టీ ప్రక్షాళన దిశగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అధికారికంగా ఇది సోనియా-రెబెల్స్‌ నేతల భేటీ అని పేర్కొనలేదు. అసమ్మతి లేఖపై సంతకం చేయని నేతలు కూడా పాల్గొంటారని వెల్లడించింది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, ప్రియాంగ గాంధీ వాద్రా కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

రెబల్స్ తో సోనియా జరుపుతోన్న సమావేశం పార్టీ ప్రక్షాళన దిశగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.కాగా, నాడు అసమ్మతివాదుల డిమాండును తెరవెనుక నుంచి సమర్థించిన కమల్ నాథ్.. ఆ తరువాత లేఖ రాసిన నాయకులతో సమావేశం కావాలని గాంధీ కుటుంబానికి నచ్ఛజెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసమ్మతి నేతలతో సయోధ్య కోసమే అధిష్ఠానం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే, నూతన సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల 19 న ఈ మీటింగ్ జరగనుందా అన్నది స్పష్టం కావడంలేదు.

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju