NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

WhatsApp: మీ ఫోన్ లో వాట్సాప్ ఉందా.. అయితే ఇక కంటి పరీక్ష చాలా ఈజీ.. ఎలాగో తెలుసుకోండి..?

Whatsapp Eye Catract test
Share

WhatsApp: క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న గ్రామీణ ప్రజలకు శుభవార్త. ప్రజల సమస్యను అర్థం చేసుకున్న స్టార్టప్ కంపెనీ లగ్గి ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ వాట్సాప్ సహకారంతో ఒక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ క్యాటరాక్ట్ సాయంతో ఇప్పుడు వాట్సాప్ ద్వారానే కంటి పరీక్ష నిర్వహించవచ్చు. ఈ సిస్టం ఎలా పనిచేస్తుంది. అనేది తెలుసుకుందాం..

Whatsapp Eye Catract test
Whatsapp Eye Catract test

మీరు క్యాటరాక్ట్ తో బాధపడుతున్నారా..? లేదా మీ ఇంట్లో పెద్దలకు ఈ సమస్య ఉందా.? అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కృత్రిమ మీరస్సు వాట్స్అప్ ఆధారంగా ఒక వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. దీని ద్వారా కంటి వ్యాధులను గుర్తించవచ్చు.. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన జీ20సమావేశంలో ఈ కొత్త టెక్నాలజీని ప్రదర్శించారు. ఇప్పటివరకు 1100 మందిని పరీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తరచూ కంటి సమస్యలతో బాధపడుతున్నారని ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రియరంజన్ ఘోష్ తెలిపారు..

కానీ సరైన సమయంలో వైద్యుల సలహాలు అందకపోవడం ఆసుపత్రిలో చికిత్స అందకపోవడంతో వారి బాధలు పెరుగుతాయి.ఇలాంటి సమయంలో ఆరోగ్య కార్యకర్త వాట్స్అప్ ద్వారా ఈ రోగుల కంటి వ్యాధులను సులభంగా గుర్తించవచ్చు. రోగి కంటికి సంబంధించిన ఫోటో తీసిన వెంటనే క్యాటరాక్ట్ ఏంటో తెలుస్తోంది. దీని ఆధారంగా రోగి వైద్యుడిని సంప్రదించవచ్చు.2021లో సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేశామని ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని విదిషాలో నడుస్తోందని చెప్పారు. దీని ద్వారా ఇప్పటివరకు 1100 మందిని పరీక్షించారు. ఇది వాట్స్అప్ ద్వారా సులభంగా తనికీ చేస్తుంది.

ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందంటే:
లగ్గి డైరెక్టర్ నివేదిత తివారి ఆ వివరాలను వెల్లడించారు. ఈ అప్లికేషన్ను వాట్సాప్ తో జోడించినట్లుగా తెలిపారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరికి వాట్స్అప్ ఉంది. తర్వాత దాని యాప్ కూడా లాంచ్ అవుతుంది. వాట్సాప్ లో ఒక నెంబర్ క్రియేట్ చేయబడింది. దీనిని కాంటాక్ట్ అని పిలుస్తారు. ఈ పరిచయంలో ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ క్యాటరాక్ట్ స్క్రీనింగ్ సొల్యూషన్ అని మా సాంకేతికతను అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. వినియోగదారులకు పరిచయాలను వాట్సాప్ లో జోడించడం తద్వారా వారి వివరాలను సేకరించి వెంటనే వ్యక్తి ప్రాథమిక సమాచారం కోసం అడుగుతారు.వాట్స్అప్ యాప్ ద్వారా పేరు లింగం ఇతర విషయాల అడుగుతారు. ఈ సమాచారం ఇచ్చిన తర్వాత కళ్ళ ఫోటో తీయాలి. ఆ ఫోటోను ఎలా తీయాలి అనే దానిపై కూడా ఓ గైడ్ లైన్ ఇవ్వబడింది. తీసిన తరువాత ఆ వ్యక్తికి కంటి శుక్లాం ఉందా లేదా అనేది చెబుతుంది..


Share

Related posts

అరటి పండు తగిలింది.. ఆస్పత్రిలో చేరింది!

Teja

జనసేనానితో ఆలీ భేటీ

somaraju sharma

తమ పేరు బయటకు రాకూడదనే వికాస్ దుబే ఎన్ కౌంటర్..? విచారణలో సంచలన నిజాలు

arun kanna