WhatsApp : వాట్సాప్ గ్రూప్చాట్లో ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ సంస్థ తన మెసెంజర్ యాప్ లో గ్రూప్ చాట్స్ లో ఫోల్స్ ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఫీచర్ పై వాట్సాప్ వర్క్ చేస్తోందని వెల్లడిస్తూ వాట్సాప్ బీటా ఇన్ఫో ఇప్పటికే స్క్రీన్ షాట్స్ ను కూడా విడుదల చేసింది. ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp : వాట్సాప్ పోల్ ఫీచర్
టెలిగ్రామ్, ఫేస్ బుక్ మెసేంజర్ లలో ఆల్రెడీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన గ్రూప్ పోల్స్ ఫీచర్ ను వాట్సాప్ తన యూజర్లకు పరిచయం చేయడానికి రెడీ అయ్యింది. ఇది డెవలప్ మెంట్ స్టేజీలో ఉందని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. పోల్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముందుగా ఒక ప్రశ్నను నమోదు చేసి, తర్వాత యూజర్లు ఓటు వేయడానికి సమాధానాలను జత పరచాల్సి ఉంటుంది.
వాట్సాప్ వాడే వారికి మరింత ఉపయోగకరం
గ్రూప్ ఉన్న మెంబర్స్ మాత్రమే వాటి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. మెంబర్లు సెలెక్ట్ చేసిన ఆప్షన్లు బట్టి పోల్స్ రిజల్ట్స్ వెల్లడవుతాయి. పోలింగ్ కు టైం లిమిట్, ఆడ్మిన్ పోల్ ఆప్షన్లు సవరించగలమా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అందుబాటులోకి వస్తే వాట్సాప్ వాడే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?