WhatsApp : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. WhatsApp తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే యూజర్ లందరికీ నోటిఫికేషన్ ద్వారా షేర్ చేసింది.. తాజాగా వాట్సాప్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది.. నూతన ప్రైవసీ అప్డేట్ కండిషన్స్ రిజెక్ట్ చేసిన యూజర్లకు మెసేజ్లను ఆపేస్తోంది..
WhatsApp : వాట్సాప్ యూజర్లకు షాక్..!!
మే 15 వా తారీకు లోపు ఏ వాట్సాప్ యూజర్ అయితే terms and conditions యాక్సెప్ట్ చేయరో వారికి అప్పటినుండి మెసేజెస్ రావు, అంతే కాకుండా ఇతరులకు కూడా వారు మెసేజ్ పంపు లేరు.. యాక్సెప్ట్ చేయని వాట్సాప్ యూజర్ల అకౌంట్ నాలుగు నెలల వరకు యాక్టివ్ స్టేటస్ లోకి వెళ్ళిపోతుంది అప్పటి వరకు వారు యాక్సెప్ట్ చేయకపోతే వారి అకౌంట్ పర్మినెంట్గా డిలీట్ అయిపోతుంది. అయితే కాల్స్ నోటిఫికేషన్స్ మాత్రం కొంత సమయం వరకు పనిచేస్తాయి.
అవి కూడా కొన్ని వారాలు మాత్రమే నని టెక్ క్రంచ్ నివేదించింది. వాట్సప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ కు సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలిపింది . వాట్సప్ తరహాలో అప్డేట్ తీసుకురావడంతో వాట్సాప్ యూజర్ లంతా ప్రత్యామ్నాయ యాప్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు.. దీంతో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ డౌన్లోడ్స్ పెరిగాయి.