Categories: న్యూస్

WhatsApp: వాట్సాప్ వాడే వారికి వార్నింగ్..!

Share

WhatsApp Scam: వాట్సాప్ వాడే యూజర్లందరినీ తాజాగా సైబర్ నిపుణులు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వినియోగదారులను బురిడీ కొట్టించి వారి డబ్బంతా కొల్లగొట్టేందుకు కొత్త స్కామ్ కు తెరలేపినట్టు వెల్లడించారు. యూజర్లు అప్రమత్తంగా ఉండకపోతే నిలువునా మోసం పోయే ప్రమాదం ఉందని సూచించారు. న్యూ ఇయర్ వేళ వాట్సాప్ లో బహుమతుల పేరిట సరికొత్త స్కామ్ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఈ స్కామ్ ఏంటి? సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి విషయాలు తెలుసుకుందాం.

 

వాట్సాప్‌లో రెడిరోఫ్.ఆర్‌యూ అనే ఓ ఫిషింగ్‌ లింక్

సైబర్ మోసగాళ్లు ఫిషింగ్‌ పద్ధతిలో యూజర్ల బ్యాంకు, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను తస్కరిస్తున్నారు. వీళ్లు Rediroff.ru అనే పేరుతో ఒక యూఆర్ఎల్ లింక్‌ గల వాట్సాప్ మెసేజ్ ను పంపిస్తారు. మోసగాళ్లు ఈ మెసేజ్ లో న్యూ ఇయర్ గిఫ్ట్ గెల్చుకున్నారంటూ యూజర్లకు నమ్మ బతుకుతారు. అది నిజమేనని క్లిక్ చేయగానే ఒక ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో యూజర్లు ఒక గిఫ్ట్ గెలుచుకున్నట్లు సందేశం కనిపిస్తుంది. దాన్ని సేకరించడానికి పేరు, వయసు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలు ఇవ్వాల్సిందిగా ఆ ఫేక్ వెబ్సైట్ అడుగుతుంది. మీ వివరాలన్నీ ఇస్తే.. మోసపోయినట్లే. సున్నితమైన మీ సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తారు. లేదా ఫేక్ వెబ్సైట్ ద్వారా మీ మొబైల్ ఫోన్ లోకి మాల్‌వేర్‌ ప్రవేశపెడతారు.

 

సురక్షితంగా ఎలా ఉండాలి

Rediroff.ru లింక్‌ తో వచ్చే వాట్సాప్ మెసేజ్ లను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసినా తక్షణమే మీ డివైజ్‌ను మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తో ఫుల్ స్కాన్ చేయండి. వాట్సాప్ లో మీరు గిఫ్ట్స్ గెలిచినట్లు వచ్చే మెసేజ్ లన్నీ ఫేక్ అని గమనించాలి. ఎందుకంటే ఏ కంపెనీ కూడా వాట్సాప్ ద్వారా బహుమతులను అందించదు. అలాగే అపరిచితులు పంపే లింకులను ఎప్పుడూ కూడా క్లిక్ చేయకూడదు. వాటిని వెంటనే డిలీట్ చేసి రిపోర్ట్ చేయడం ద్వారా మంచిది.

 


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

6 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

9 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago