Uber WhatsApp: సోషల్ మీడియాలో వాట్సాప్ ఓ సంచలం.. ఇది లేని స్మార్ట్ ఫోన్ ఉంటదు అంటూ అతిశయోక్తి కాదు. ఇక.. ప్రయాణికులకు జర్నీని మరింత ఈజీ చేసేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్‌లు వచ్చాయి. దీని ద్వారా ప్రయాణికులు అనుకున్న టైంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం పెద్ద నగరాలకే ఈ సేవలు పరిమితమయ్యాయి. అయితే ఇప్పటికే పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చి యూజర్స్‌కు మనీ ట్రాన్స్ఫర్ మరింత ఈజీ చేసింది వాట్సాప్
ఇక వాట్సప్ లోనే..
వాట్సాప్‌తో ఉబర్ చేతులు కలిపి సేవలను మరింత సులభతరం చేయనుంది. వాట్సాప్ ద్వారానే ఆటో, క్యాబ్, బైక్ రైడ్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఊబర్ అందుబాటులోకి తెచ్చింది. లక్నోలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. త్వరలోనే భారత్ లోని ఆయా నగరాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వరల్ట్లో ఫస్ట్ టైం ఇండియాలోనే ఈ విధానాన్ని తీసుకురావడం విశేషం. భారత్‌లో సుమారు 40 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఇలాంటి వాట్సాప్ తో ఉబర్ చేతులు కలపడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గుగుల్ స్టోర్ నుంచి ఊబర్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే సేవలు అందించాలని భావిస్తోంది ఉబర్. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో ఉన్న ఈ సేవలను త్వరలోనే మిగితా భాషల్లోనూ అందించేందుకు ఊబర్ ప్రయత్నాలు చేస్తోంది. ఫోన్ నంబర్‌తో ఊబర్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు ఈ సర్వీసులు పొందొచ్చు. యాప్ లో చూపించిన మాదిరిగానే డ్రైవర్ నేమ్, వెహికల్ నంబర్ వంటి డీటెయిల్స్ మనకు వస్తాయి.
బుకింగ్ ఇలా…
ఉబర్ రైడ్‌ను వాట్సాప్ ద్వారా మూడు రకాలుగా బుక్ చేసుకునే చాన్స్ ఉంది. ఊబర్ బిజినెస్ అకౌంట్‌కు వాట్సాప్ నుంచి మెసేజ్ పంపొచ్చు. లేదంటే క్యూఆర్ స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే ఉబర్-వాట్సాప్ చాట్ ఓపెనయ్యే లింక్‌పై క్లిక్ చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు వాట్సాప్ బిజినెస్ నంబర్‌ను ఇంకా ప్రకటించలేదు ఉబర్. దీనిని ప్రకటించాకే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.