న్యూస్

సిగ్నల్ స్పీడుకు బెంబేలెత్తిన వాట్సాప్!ప్రైవసీ పాలసీ అమలు నాలుగు నెలలు వాయిదా!!

Share

తమ కంపెనీ నిబంధనలను ఫిబ్రవరి 8లోగా అంగీకరించకపోతే యూజర్ల అకౌంట్ డిలీట్ చేస్తామని చెప్పిన వాట్సాప్.. తన నిర్ణయాన్ని మార్చుకుంది.

వాట్సాప్ తమ నూతన ప్రైవసీ పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 15 వరకు తమ పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ తమ అఫిషీయల్ ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

అంతకుముందు వాట్సప్ ఏం చెప్పింది?

ఫిబ్రవరి 8లోపు తమ నూతన పాలసీను అంగీకరించకపోతే అకౌంట్ డిలీట్ చేస్తామని వాట్సాప్ 2 బిలియన్ల యూజర్లను హెచ్చరించింది. దాంతో యూజర్ల నుంచి వాట్సాప్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమ వ్యక్తిగత డేటా లీక్ అవుతుందేమోనని యూజర్లు ఆందోళన చెందారు. వాట్సాప్ పాలసీ నచ్చని వాళ్లు.. వేరే ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు చూస్తుండటంతో నూతన పాలసీని వాయిదా వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇప్పుడు వాట్సాప్ ఏమి చెబుతోంది!

జనవరి 5న కంపెనీ కొత్త విధానాన్ని ప్రకటించినప్పటి నుంచి.. యూజర్ల నుంచి అసహనం వ్యక్తం అయింది. యూజర్ల డేటా, లోకేషన్, పైవసీ మొదలైనవి లీక్ అవుతాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దాంతో యూజర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. నూతన పాలసీ విధానాన్ని వాయిదా వేస్తున్నాం. ఫిబ్రవరి 8న ఏ యూజర్ యొక్క అకౌంట్ డిలీట్ కాదు మరియు తాత్కాలికంగా నిలిపివేయబడదు. యూజర్లు ఎదర్కొంటున్న గందరగోళాన్ని తగ్గించడానికి మేం తీవ్ర కృషి చేస్తున్నాం. మే వరకు మా వ్యాపార ప్రణాళికలను వెనక్కి తీసుకుంటున్నాం.

నిబంధనలను సమీక్షించడానికి మరియు అర్థం చేసుకోవడానికి వినియోగదారులకు ఇంకా ఎక్కువ సమయం ఉంది. నూతన పాలసీ ఆధారంగా యూజర్ల ఖాతాలను తొలగించాలని ఎప్పుడూ ప్లాన్ చేయలేదు మరియు భవిష్యత్తులో కూడా అలా చేయబోం’ అని వాట్సాప్ ట్వీట్ చేసింది.అయితే వాట్సాప్ నూతన విధానం నచ్చని యూజర్లు ఇప్పటికే లక్షల సంఖ్యలో దీనికి ప్రత్యామ్నాయమైన సిగ్నల్ ,టెలిగ్రామ్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ మధ్య కాలంలో ఆయా యాప్ ల డౌన్లోౢడులువిపరీతంగా పెరిగిపోగా వాట్సాప్ యూజర్లు క్రమంగా తగ్గిపోతున్నారు.పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన వాట్సాప్ తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు స్పష్టం అవుతోంది.అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పవచ్చు.

 


Share

Related posts

Pearl: మంగళ సూత్రాలతో పాటు ముత్యం,పగడం ఎందుకు వేసుకోవాలో తెలుసుకోండి!!

siddhu

బిగ్ బాస్ 4: హారిక చెంప చెళ్లుమనిపించిన ఆ కంటెస్టెంట్..!!

sekhar

Anasuya: ఇండస్ట్రీలో మరో మెగా బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar