Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ లవ్ స్టొరీ గా రాధ కృష్ణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 1970 కాలం నాటి వింటేజ్ లవ్ స్టోరీగా గా ఈ సినిమా రూపొందుతుండగా టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి మొదటి సారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు.
అయితే సాహో వచ్చి రెండేళ్ళు దాటి పోవడంతో రాధే శ్యామ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. అయితే ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది.
Prabhas : రాధే శ్యామ్ సినిమా వీఎఫెక్స్ వర్క్ కి ఇంకా సమయం..!
ప్రభాస్ కి పాన్ ఇండియన్ స్టార్ గా ఉన్న క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. అయినా కూడా రాధే శ్యామ్ లాంటి సినిమాకి ప్రమోషన్స్ చాలా అవసరం. లేదంటే చిన్న సినిమా అయినా ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు. సినిమాలో దమ్ము లేనట్టుంది..అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ వస్తాయి. అదే ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా విషయంలో మాట్లాడుకుంటున్నారట. కానీ అసలు విషయం ఏమిటంటే రాధే శ్యామ్ సినిమా వీఎఫెక్స్ వర్క్ ఇంకా సమయం పడుతుండటంతో రాధే శ్యామ్ ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్ట లేదని త్వరలో మొదలు కానున్నాయని తెలుస్తోంది.