Save Money: డబ్బు పొదుపు చేసుకోవాలన్న ఆలోచన వస్తే చాలు చాలా మార్గాలు ఉంటాయి.. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

Share

Save Money: టెక్నాలజీ ఉపయోగించుకుని డబ్బు పొదుపు చేయండి.  మీరు ఇంట్లో ఏదైనా వస్తువులు కొనాలనుకుంటే… ఆన్‌లైన్‌లో ఆర్డర్  పెట్టండి. మీకు కావాల్సిన వస్తువులు డైరెక్ట్ గా  మీ గుమ్మం లోకి వచ్చేస్తాయి .అప్పుడు  మీ సమయం దానితో పాటు  పెట్రోల్  కూడా ఆదా అవుతుంది. అంతేకాదు… ఆన్‌లైన్‌లో ఆఫర్లు వినియోగించుకోవచ్చు.   అంతగా అర్జెంట్  కాని వస్తువులు ఏవైనా ఉంటే కనుక  పండుగలకు పెట్టె  సేల్‌లో తక్కువ  రేటుకే కొనుక్కోవచ్చు.

ప్రతి వీక్ ఎండ్ కి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఎంజాయ్  ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది.  కానీ ఇది మీ ఖర్చులను పెరిగేలా చేస్తుంది.  కాబట్టి  ఇంట్లోనే చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసుకోవడం లేదా కలిసి తినడం వంటివి చేయవచ్చు.  ఇలాచేయడం వలన  ఖర్చు తగ్గడంతో పాటు.. ఆరోగ్యనికి కూడా మంచిది. అందుకే నెలలో రెండు సార్లు బయట  పార్టీ కి వెళ్తే  ..మరో రెండు సార్లు ఎవరో ఒకరి ఇంట్లో పార్టీ చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా.. ఆఫీసులో అయితే పాట్ లక్ పార్టీ చేసుకోవడం బాగుంటుంది.
అమెజాన్ ప్రైమ్,నెట్ ఫ్లిక్స్, ఆహా హాట్ స్టార్.. ఇలా కనిపించే ప్రతీ సినిమా సైటుకీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే..  మీ బ్యాంక్ బ్యాలన్స్‌కి గండి పడ్డట్లే. డబ్బు చాలా ఖర్చు అవుతుంది.      మీ స్నేహితులతో కలిసి ఒక్కొక్కరూ ఒక్కో సబ్‌స్క్రిప్షన్ తీసుకొని.. అకౌంట్  ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండడం వలన డబ్బు పొదుపు చేసుకోవచ్చు.
మీకు కాఫీ అంటే ఇష్టం అని  మీ ఆఫీస్ పక్కన ఉన్న కేఫ్ నుంచి కాఫీ తెప్పించుకొని తాగుతూ మీ డబ్బు వృథా చేసుకోవడం కన్నా   తాజా కాఫీ ప్లాస్కో లో నిల్వ చేసి.. మీ వెంట తీసుకెళ్లడం  చాలా మంచిది.చాలామంది ఫ్యాన్ ,లైట్లు, ఏసీ, లు ఆఫ్ చేయడం  మర్చిపోతుంటారు. వీటి అవసరం లేనప్పుడు ఆఫ్ చేయడం వల్ల పర్యావరణానికి  ,మీ అకౌంట్ బ్యాలన్స్‌కి కూడా చాలా మేలు జరుగుతుంది.   అందుకే విద్యుత్తును వీలున్నంత పొదుపు చేయడం మంచిది.

కొవ్వు కరిగి  పోవాలి అన్న   కోరిక తో  చాలా మంది ఖరీదైన జిమ్‌లో మెంబర్‌షిప్స్  తీసుకుని పర్సనల్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ క్లాసులు అంటూ చాలా డబ్బు  ను కరిగిస్తుంటారు. కానీ జిమ్ కి  వెళ్లడం మాత్రం చాలా తక్కువ. ఇలా చేయడం వల్ల మీరు కట్టిన డబ్బు అంతా  వృధా  అయిపోతుంది. మీరు ఫిట్‌నెస్‌ని మీ లైఫ్‌స్టైల్‌గా  మార్చుకోవాలనుకుంటే, ముందు పార్క్‌లో పరుగెత్తడం, సైకిల్ తొక్కడం వాకింగ్,చిన్న పాటి  వ్యాయామం చేయండి..    అలా రోజూ  చేయడం అలవాటు అయిన తర్వాత      జిమ్ మెంబర్‌షిప్  తీసుకునే ప్రయత్నం చేయండి.
నెలకు ఎంత డబ్బు వచ్చింది దేనికి ఎంత ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది రాయడం అలవాటు చేసుకోండి. ఈ అలవాటు వలన ఎక్కడ అనవసర ఖర్చు అవుతుందో తెలుసుకుని వాటిని తగ్గించుకోవచ్చు. పొదుపు చేయడం అంటే డబ్బు సంపాదించడం అవుతుంది.


Share

Related posts

తిరిగి సొంత గూటికి..

somaraju sharma

Smita Gondkar Adorable Pictures

Gallery Desk

బిగ్ బాస్ 4 : అవినాష్ రెమ్యునరేషన్ తెలిస్తే నోరు తెరుస్తారు..! అంత డబ్బు దేనికి ఉపయోగపడింది అంటే….

arun kanna