గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ మహారాజా రవితేజ కు క్రాక్ రూపంలో అదిరిపోయే హిట్ దొరికింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హిట్ సినిమాగా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.
గతంలో రవితేజతో డాన్ శీను బలుపు సినిమాలతో 2 విజయాలు నమోదు చేసుకున్న గోపీచంద్ మలినేని తాజాగా ఈ సినిమాతో హిట్ సాధించి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ మొదట విక్టరీ వెంకటేష్ వద్దకు వెళ్లినట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వస్తోంది. లేటెస్ట్ స్టోరీ విషయంలో కొద్దిగా మార్పులు చేయమని చెప్పిన తరుణంలో.. మార్పులు చేసినా గాని పెద్దగా నచ్చకపోవడంతో పాటు స్టొరీపై పెద్దగా నమ్మకం కలగక పోవడంతో వెంకటేష్ “క్రాక్” సినిమా ని పక్కన పెట్టినట్లు టాక్.
ఇదే తరుణంలో గోపీచంద్ మలినేని రవితేజ వద్దకు వెళ్లగా.. స్టోరీ విని మొదటి సిట్టింగ్ లోనే ఆయన ఓకే చేయడం జరిగిందట. ఆ విధంగా అదృష్టం రవితేజ గురించి.. అట్టడుగున ఉన్న కెరియర్ ని “క్రాక్” పైకి తీసుకు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చాలా కాలం తర్వాత రవితేజ హిట్ కొట్టడంతో ఆయన అభిమానులు ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!