చిట్కాలతో ఆ బిల్లు పాసయ్యేనా ?

 

ఢీల్లీ, డిసెంబర్28:  ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందని బీజెపీ, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లు  లోక్‌సభలో ఆమోదం పొందింది. లోక్‌సభలో బిల్లు అమోదం పోందడంపై స్వామి మాట్లాడుతూ రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. బీజేపీకి రాజ్యసభలో బిల్లుపాస్ అవ్వడానికి సరిపడా సభ్యుల సంఖ్య లేకపోయినప్పటికీ కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు సుబ్రమణ్యస్వామి,  ఎంటీ ఆ చిట్కాలు?

తక్షణ తలాక్‌ విధానంతో విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళా బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్‌యే కాక బీజెపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే కూడా సభ నుంచి వాకౌట్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.