కమెడియన్ కాకముందు హైపర్ ఆది ఏం జాబ్ చేసేవాడో తెలిస్తే అవాక్కవాల్సిందే..!

హైపర్ ఆది.. జబర్దస్త్ లో ఓ సంచలనం. హైపర్ ఆది పేరు చెబితే చాలు.. ఆయన వేసే పంచులు గుర్తు తెచ్చుకొని మరీ నవ్వుతారు కొందరు. జబర్తస్ లో ఆయన వేసే పంచులకు నవ్వలేక జడ్జిలు, యాంకరే కాదు.. ప్రేక్షకులు కూడా తెగ ఇబ్బంది పడతారు. నవ్వీ నవ్వీ కడుపు నొప్పి లేవడం మాత్రం ఖాయం. ఫటా ఫట్.. ధనా ధన్.. అన్నట్టుగా టకాటకా పంచులు వేస్తుంటాడు హైపర్ ఆది.

which job aadi did before jabardasth show?
which job aadi did before jabardasth show?

అయితే.. హైపర్ ఆదికి జబర్దస్త్ లో అవకాశం అంత ఈజీగా రాలేదు. అదిరే అభి స్కిట్ లో చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. కష్టపడి.. టీమ్ లీడర్ అయి ఇప్పుడు జబర్దస్త్ నే శాసించే స్థాయికి ఎదిగాడు హైపర్ ఆది.

అయితే.. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి వెళ్లాలన్న కసి ఉన్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల బీటెక్ అయిపోగానే.. జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆదికి. దీంతో ఆది.. బీటెక్ అయిపోగానే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కానీ.. ప్రతీ శనీ, ఆదివారాలు ఏదో ఒక ఆడిషన్ కు వెళ్లేవాడు. తనకు నటించే చాన్స్ ఇవ్వాలంటూ అందరినీ కోరేవాడు. అలా.. ముందు ఆదికి స్క్రిప్ట్ రైటర్ గా చాన్స్ రావడం.. ఆ తర్వాత అదిరే అభితో పరిచయం అవడం.. ఆ తర్వాత అదిరే అభి.. జబర్దస్త్ లో చిన్న క్యారెక్టర్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

అదిరే అభితో కేవలం 12 స్కిట్లు చేసి.. ఆ తర్వాత వెంటనే టీమ్ లీడర్ అయిపోయాడు హైపర్ ఆది. సాఫ్ట్ వేర్ జాబ్ నుంచి జబర్దస్త్ కమెడియన్ గా ఎలా ఎదిగాడో ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. మీరు కూడా ఆ వీడియో చూసి.. హైపర్ ఆది.. సక్సెస్ స్టోరీని తెలుసుకోండి..